NTV Telugu Site icon

Cono Corpus: ఈ మొక్కను ఇంట్లో పెంచుతున్నారా? ప్రాణాలు కాపాడుకోండి

Cono Corpus Min (1)

Cono Corpus Min (1)

సాధారణంగా పచ్చగా, ఏపుగా పెరిగే మొక్కలను అందరూ ఇళ్లలో పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఈ నేపథ్యంలో చూసేందుకు అందంగా కనిపించే కోనో కార్పస్ అనే మొక్కను కూడా గతంలో చాలా మంది రోడ్డు డివైడర్ల మధ్యలో, నర్సరీల్లో, ఇళ్లల్లోనూ పెంచుతున్నారు. ఈ మొక్క నాటిన కొన్ని వారాల్లో ఏపుగా పెరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో ఈ మొక్కలు నాటవద్దని అధికారులు సూచిస్తున్నారు. రోడ్లపై, నర్సరీలలో, ఇళ్లల్లో ఎక్కడా ఈ మొక్కలను పెంచవద్దని నిషేధం విధించారు. ఈ మొక్కల కారణంగా పట్టణ ప్రాంత ప్రజల్లో శ్వాసకోస సమస్యలు తలెత్తుతున్నాయని సైంటిస్టులు గుర్తించారు. అంతేకాకుండా ఈ చెట్టు భూ గర్భంలోని జలాన్ని ఇట్టే తోడేస్తుందని.. ఒక్కసారి ఈ మొక్కను నాటితే 80 మీటర్ల వరకూ దీని వేరు భూమిలోకి వెళ్లిపోయి నీరును తాగేస్తుందని హెచ్చరిస్తున్నారు.

Read Also: Kerala Lulu Mall: 50% డిస్కౌంట్.. సునామీలా దూసుకొచ్చిన జనం

సైంటిస్టుల సూచనలతో ప్రపంచంలోని సగానికి పైగా దేశాలు ఈ కోనో కార్పస్‌ మొక్కలపై నిషేధం విధించాయి. గల్ఫ్‌ దేశాల్లోనూ, అమెరికాలోని టెక్సాస్‌ వంటి చోట్ల ఈ మొక్కలు నాటితే వారికి కఠిన శిక్ష తప్పదు. అయితే గతంలో అటు ఏపీ, ఇటు తెలంగాణ రాష్ట్రాలలో కోనో కార్పస్ మొక్కలను విస్తృతంగా పెంచారు. తెలంగాణలో అయితే హరితహారం కార్యక్రమంలో భాగంగా నర్సరీల్లో ఈ మొక్కలను పెంచారు. అయితే ఇది ప్రమాదకర మొక్క అని ఆలస్యంగా గ్రహించి ప్రస్తుతం అన్ని చోట్ల ఈ మొక్కలను తొలగిస్తున్నారు. కోనోకార్పస్‌ పువ్వులోని పుప్పొడి కారణంగా మానవాళితో పాటు పక్షులకు కూడా ప్రమాదం వాటిల్లే అవకాశాలున్నాయని సైంటిస్టులు గుర్తించారు. పుప్పొడి కారణంగా ఈ మొక్కలపై సీతాకోక చిలుకలు సైతం వాలడం లేదని.. జంతువులు కూడా ఈ మొక్క ఆకులు తినడం లేదని పరిశోధకులు స్పష్టం చేశారు.