క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే చర్చిలకు తరలివచ్చిన క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. లోక రక్షకుడు ఏసుక్రీస్తు బోధనలను క్రైస్తవ మతపెద్దలు వివరించారు. కాగా.. మరోవైపు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా, క్రిస్మస్, శాంటా క్లాజ్ కు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా ఉన్నాయి. వాటిని చూసిన నెటిజన్లు నవ్వును ఆపుకోలేక పోతున్నారు. మీరు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో యాక్టివ్‌గా ఉన్నట్లయితే.. ఆ వీడియోలను చూసే ఉంటారు. కాగా.. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో అందరినీ నవ్విస్తోంది.
READ MORE: Serial killer: “లిఫ్ట్ ఇచ్చి హత్య”..11 మందిని చంపిన సీరియల్ కిల్లర్ అరెస్ట్..
వైరల్ వీడియోలో ఏం ఉంది?
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో భిన్నమైన ఫైట్ కనిపిస్తోంది. శాంతా క్లాజ్ – స్పైడర్ మ్యాన్ నడి రోడ్డుపై ఒకరినొకరు కొట్టకున్నాట్లు చూడొచ్చు. ఒకరు శాంటా దుస్తులు, మరొకరు స్పైడర్ మాన్ దుస్తులు ధరించారు. ఇద్దరూ పోట్లాడుకుంటున్నట్లు నటిస్తున్నారు. హాస్యభరితంగా చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో @raaahulpandey అనే ఎక్స్ ఖాతా దారుడు పోస్ట్ చేశాడు. దీన్ని ఇప్పటికే వేల సంఖ్యలో వీక్షించారు. ఈ వీడియోను చూసిన కొంత మంది తమ స్పందనను కూడా తెలియజేశారు. ఒక వినియోగదారు రాశారు.. “వావ్, వాట్ ఎ సీన్.” అని కామెంట్ చేశారు. మరొక వినియోగదారు “ఈ ఇద్దరి మధ్య గొడవకు కారణం ఏమిటి? ఇంతకు ఇద్దర్లో ఎవరు గెలిచారు.” అని హాస్యాస్పదంగా రాసుకొచ్చారు. ఇదిలా ఉండగా.. ఈ వీడియో ఏ ప్రాంతానికి చెందినదో స్పష్టత లేదు.
READ MORE: Arvind Kejriwal News: అతిషీని కూడా అరెస్టు చేయవచ్చు, బీజేపీకి సీఎం నాయకుడు లేదు : అరవింద్ కేజ్రీవాల్
Merry Christmas 🎄🎅💀#MerryChristmas pic.twitter.com/nwuJeVT8r5
— Rahul Kumar Pandey (@raaahulpandey) December 25, 2024