Site icon NTV Telugu

Russia Z Symbol: ర‌ష్య యుద్ధ ట్యాంకుల‌పై జెడ్ గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా?

ర‌ష్యా ఉక్రెయిన్ దేశాల మ‌ధ్య యుద్ధం తీవ్ర స్థాయిలో జ‌రుగుతున్న‌ది. దీంతో ఉక్రెయిన్‌లో ఎటు చూసీనా భీభ‌త్స‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఎప్పుడు ఏ క్ష‌ణంలో ఎటు నుంచి బాంబులు వ‌చ్చిప‌డ‌తాయో, ఎటు నుంచి తూటాలు దూసుకొస్తాయో తెలియ‌క ఇబ్బందులు ప‌డుతున్నారు. ర‌ష్యా నుంచి పెద్ద సంఖ్య‌లో ట్యాంకర్లు విరుచుకుప‌డుతున్నాయి. అయితే, ఈ ట్యాంక‌ర్ల‌లో కొన్నింటిపై జెడ్ అనే అక్ష‌రం రాసున్న‌ది. ఆ అక్ష‌రం ఏంటి? ఎందుకు జెడ్ అక్ష‌రాన్ని దానిపై రాస్తారు అనే విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Read: Zelensky : కీవ్ మా ఆధీనంలోనే ఉంది… చివ‌రి ర‌క్త‌పు బొట్టు వ‌ర‌కు పోరాటం చేస్తాం…

జెడ్ అనే అక్ష‌రం ఉన్న ట్యాంకర్ల‌లో ప్ర‌యాణం చేసే ఆర్మీని రోజ్గావార్డియా ట్రూప్స్ అని పిలుస్తారు. వీరినే జాతీయ భ‌ద్ర‌తా ద‌ళం అని కూడా అంటారు. ఈ ద‌ళంలోని సేన‌లు ప్ర‌త్యేక‌మైన ట్రైనింగ్ తీసుకొని ఉంటారు. అధ్య‌క్షుడి బాధ్య‌త‌ల‌ను ఈ ద‌ళం చూసుకుంటుంది. యుద్ధ విద్య‌లో ఆరితేరి ఉంటారు. ఎలాంటి ప‌రిస్థితులు ఎదురైనా, వాటిని ఛేదించుకొని ముందుకు అడుగువేయ‌డం మాత్ర‌మే వీరికి తెలిసిన విద్య‌. ప్రాణాల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా టార్గెట్ పై మాత్ర‌మే దృష్టి సారించే తత్వం వీరి సొంతం. జెడ్ సింబ‌ల్ ఉన్న ట్యాంకులు ప్ర‌యాణం చేసే స‌మ‌యంలో వారికి అక్క‌డి ప్ర‌జ‌లు సాద‌ర స్వాగ‌తం ప‌లుకుతుంటారు.

Exit mobile version