NTV Telugu Site icon

Viral: నడి సముద్రంలో రెండు ముక్కలైన ఓడ… రెస్క్యూ ఆపరేషన్‌ వైరల్..

Ship

Ship

నడి సముద్రంలో ఓ ఓడ రెండు ముక్కలైపోయింది.. ఈ ప్రమాదంలో 30 మంది సిబ్బంది గల్లంతయ్యారు.. అయితే, గల్లంతైన వారి కోసం వందలాది పడవలు, ఫిషింగ్‌ ఓడలు రంగంలోకి దిగి ఆపరేషన్‌ నిర్వహించడం ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ చైనా సముద్రంలో చాబా తుఫాన్ సృష్టించిన బలమైన అలల కారణంగా.. సముద్రంలో ప్రయాణం చేస్తున్న ఓడ రెండుగా విడిపోయింది.. ఈ ప్రమాదంలో నావికులను రక్షించేందుకు జరుగుతోన్న ఆపరేషన్‌కు సంబంధించిన ఫుటేజ్‌ను హాంకాంగ్ ప్రభుత్వ ఫ్లయింగ్ సర్వీస్ (జీఎఫ్‌ఎస్‌) షేర్ చేసింది. ఆ క్లిప్‌ను గమనిస్తే.. మునిగిపోతున్న ఓడపై అలలు అల్లకల్లోలంగా కనిపిస్తున్నాయి.. ఇక, ఒక నావికుడిని హెలికాప్టర్ పైకి లాగడం చూపించారు..

Read Also: Dwarampudi Chandrasekhara Reddy: చంద్రబాబు ప్రోద్భలంతోనే వంగవీటి రంగా మర్డర్..!

ఇక, కఠినమైన వాతావరణ పరిస్థితుల మధ్య సాహసోపేతమైన పనిని చేపట్టినందుకు రెస్క్యూ సిబ్బందిపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.. కాగా, దక్షిణ చైనా సముద్రంలో హాకాంగ్‌కు నైరుతి దిశలో 160 నాటికల్ మైళ్లు (296 కిలోమీటర్లు) దూరంలో ఓడ ప్రమాదానికి గురైంది.. దాదాపు 30 మంది సిబ్బంది గల్లంతు అయ్యారు.. హాంకాంగ్‌ కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 7.25 గంటలకు ప్రమాదం జరిగింది.. ఇక, ఈ ప్రమాదం జరిగిన ప్రదేశానికి 50 నాటికల్‌ మైళ్ల దూరంలో 12 మంది మృతదేహాలను రెస్కూ సిబ్బంది కనుగోన్నారు.. ఇక, ప్రమాదం జరిగిన వెంటనే శనివారం ముగ్గురిని రక్షించారు. మరొకరిని సోమవారం తెల్లవారుజామున రక్షించారు. రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతుండగా.. దాదాపు ఏడు విమానాలు, 249 పడవలు, 498 ఫిషింగ్ ఓడలు ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయని అధికారులు చెబుతున్నారు.. మొత్తంగా రెస్కూ ఆపరేషన్‌కి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారిపోయింది.. ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నవారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.