Site icon NTV Telugu

Weird Job: ఆ వీడియోలు చూడు.. రూ. 1500 పట్టు!

Rebecca Dixon Scotland

Rebecca Dixon Scotland

సోషల్ మీడియా వాడకం విస్తృతంగా పెరిగిపోయినప్పటి నుంచి విచిత్రమైన ఉద్యోగాలు పుట్టుకొచ్చేశాయి. అయితే, ప్రతీ ఉద్యోగం వెనుక కాస్తోకూస్తో శ్రమ అనేది ఉంటుంది. సుఖంగా కూర్చోబెట్టి ఎవ్వరూ జీతం ఇవ్వరు. కానీ, ఓ సంస్థ మాత్రం అలాంటి సౌకర్యవంతమైన ఉద్యోగమే ఆఫర్ చేసింది. ఇంట్లోనే కూర్చొని వీడియోలు చూడాలంతే! అయితే, అవి సాధారణ వీడియోలు కావు, అడల్ట్ వీడియోలు. (మీకు అర్థమవుతోందా!)

‘బెడ్‌బైబిల్స్’ అనే ఓ అడల్ట్ వెబ్‌సైట్.. ఒక పోర్న్ రీసెర్చ్ ప్రాజెక్ట్‌కు హెడ్‌గా నియమించేందుకు ఇటీవల ఎంపికలు చేసింది. ఈ ఉద్యోగానికి ఏకంగా 90 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. చివరికి స్కాట్‌ల్యాండ్‌కు చెందిన 22 ఏళ్ల రెబెక్కా డిక్సన్ ఈ ఉద్యోగాన్ని సాధించింది. కేవలం పోర్న్ వీడియోలు చేయడమే ఈమె పని. ఒక్కో వీడియో వ్యవధి ఎంతుంది? సెక్స్ పొజిషన్స్? వాటిల్లో నటించిన నటీనటుల సామర్థ్యం.. ఇంకా మరిన్ని కొత్త విషయాల్ని కనిపెట్టి పేర్కొనాలి. వీటిపై ప్రత్యేకంగా ఎనాలసిస్ రాయాల్సి ఉంటుంది.

ఈ జాబ్‌కు గాను ఆ అమ్మాయి గంటకు 20 డాలర్లు ఇస్తోంది ఆ సంస్థ. మన భారతీయ కరెన్సీలో చూసుకుంటే.. రూ. 1562 అన్నమాట! 90 వేల మందిలో రెబెక్కా మాత్రమే ఎంపికైందంటే.. పోర్న్ వీడియోస్ చూడటంలో ఆమె ఎంత నిపుణురాలో అర్థం చేసుకోవచ్చు. ఈ జాబ్ చాలా విచిత్రంగానూ, అదే సమయంలో జుగుస్పాకరంగానూ అనిపిస్తోంది కదూ!

Exit mobile version