Site icon NTV Telugu

Rat: ఎలుక ఉంది జాగ్రత్త.. ప్లీజ్‌ డోంట్‌ డిస్టర్బ్‌

Rat

Rat

Rat in the meeting: సోషల్‌ మీడియాలో నెటిజన్లు అనేక వీడియోలు పోస్ట్‌ చేస్తూ ప్రజలతో వారి కామెంట్లు కోరుకుంటుంటారు. చాలా మంది ఆ వీడియోలను చూసి తెగ కామెంట్లు చేస్తుంటారు. వీడియో చూడటమే కాదు వీడియో తీసేవాళ్లకు కూడా పొగడాల్సిందే అంటానే నేను. ఎందుకంటే మన కంటి కనిపించని వాటిని కూడా వీడియో, ఫోటో గ్రాఫర్లు దాన్ని క్లిక్‌ చేసి మనకు తెలియని విషయాలను సైతం తెలియజేస్తుంటారు. వాటిని చూసి ఆశ్చర్యానికి గురిచేస్తుంటారు. ఒకానొక సందర్భంలో మనం తరుచూ వింటుంటాం. మా ఇంట్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉంది అని, మరొ కొందమంది అయితే గోడోన్‌ లో ఎలుకలు తెగ తలనొప్పిగా మారిందని చెబుతుంటారు. కానీ ఎలుకలు గోడోన్‌ లో, ఇళ్లలో, బయట, ఆఫీసుల్లో ఇలా అనేక రకాలుగా వింటుంటాము. కానీ మన శబ్బంవిని అక్కనుంచి పరారుకూడా అవుతాయి. కానీ ఒక ఎలుక మీటింగ్‌ కి హాజరై,అందులో వడ్డించిన స్నాక్స్‌ను కూడా లాగించేసిందండోయ్‌. ఇది ఓ వీడియో గ్రాఫర్‌ కంట పడటంతో ఈ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

Read also: Bill Gates Financial Support to Africa: కావాలి ఇంకా.. అంటున్న ఆఫ్రికా..

కాశ్మీర్‌లో ఒకచోట వీఐపీ సమావేశం జరుగుతోంది. అక్కడ అంతా పెద్ద పెద్ద వీఐపీలు కూర్చున్నారు. ఒక విషయం పై తీవ్రమైన చర్చ జరుగుతుంది. అందులో ఓ వీఐపీ తన మాటలు మిగతా అధికారులకు తెలుపుతున్నాడు. అయితే అంతా బాగానే ఉంది. కానీ అధికారులతో పాటు అక్కడ వీఐపీ టేబుల్‌ పై ఒక ఎలుక ప్రత్యక్షమైంది. అదికూడా ఒక బొకేపక్కనే ఉంది. అంతేకాదు అధికారికి పెట్టిన ఒకప్లేట్‌ లో కేక్‌ ముక్కతింటూ ఆమీటింగ్‌ను వింటూ తన పని తానుచేసుకుంటూ ఉంది. అయినా అక్కడి వారు ఎవ్వరికి ఆ ఎలుక కనిపించలేదు. అయితే అక్కడే అధికారి వెనుక ఉన్న ఓ కెమెరామెన్‌ ఆ మీటింగ్‌ ను కవర్‌ చేస్తున్న సమయంలో బోకేవైపువెలుతూ కెమెరాను స్లోగా ప్లేట్‌ పై పెట్టాడు. అంతే అందులో కేక్‌ తింటూ ఎలుక దర్శనమిచ్చింది.

Read also: Student Stuck Between Train and Platform: ప్లాట్ ఫాం-రైలు మధ్య ఇరుక్కుపోయి నరకం చూసిన విద్యార్థిని..

అంతే కెమెరామెన్‌ దానిమీదే ఫోకస్‌ పెట్టి తన కెమెరాలో ఆ.. ఎలుకను బంధించాడు. అంతనిస్సబ్దంగా జరుగుతున్న మీటింగ్ లో ఎలుక ప్రత్యక్షమడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. కొందరు కెమెరామెన్‌ ను పొగడేస్తుంటే.. మరొకొందరు అంతమందిలో కూడా టేబుల్‌ ఎక్కి కేక్‌ లాగించేయడంపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆరిఫ్ ఖవాజా అనే ట్విటర్ వినియోగదారు పోస్ట్ చేసిన ఈ వీడియో పాటు, “ఎలుక సమావేశంలో” అని క్యాప్షన్ ఉంది. డిసెంబర్ 5న పోస్ట్ చేసిన ఈ వీడియో ట్విటర్‌లో 22,000 మంది వీక్షణలను సంపాదించుకుంది. కొందరు ఎలుకను తినడానికి ఆహ్వానించారు” అని కామెంట్‌ చేయగా.. మరొకొందరు “అయ్యో” దానికి ఎంత ఆకలేసిందో అంటూ రాసుకొచ్చారు. ఇంకొకరు మనిషులతో సమానంగా ఎలుక పాల్గొంటుంది” అని వ్యాఖ్యానించారు. ఏదైతేనేం సమావేశంలో ఎలుక రావడమేకాదు కేక్‌ కూడా తినడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Exit mobile version