NTV Telugu Site icon

ఆ కోట ఖ‌రీరు కేవ‌లం రూ. 88 మాత్ర‌మే…

జ‌ర్మ‌నీలోని హ‌నోవ‌ర్‌లోని రాజ‌వంశీయులకు చెందిన పురాత‌న‌మైన కోట ఒక‌టి ఉంది. ఈ కోట‌ను హ‌నోవ‌ర్ యువ‌రాజు ప్ర‌భుత్వానికి 1 యూరోకు అమ్మేశారు. దీంతో యువ‌రాజు తండ్రి ఎర్నెస్ట్ ఆగ‌స్ట్ కోర్టులో దావా వేశాడు. 66 ఏళ్ల ఎర్నెస్ట్ వ‌య‌సు మీద ప‌డుతుండ‌టంతో త‌న ఆస్తిని తన కుమారుడు పేరిట రాసిచ్చారు. ప‌ర్యాట‌కంగా కోట‌కు మంచిపేరు ఉండటంతో మ‌రింత అభివృద్ధి చేయాల‌ని తండ్రి భావించాడు. అయితే, కోట ఖ‌ర్చుకోసం పెద్ద సంఖ్య‌లో డ‌బ్బు అవ‌స‌ర‌మౌతుంద‌ని గ్ర‌హించిన కుమారుడు దానిని ప్ర‌భుత్వానికి యూరోకు అమ్మేశాడు.

Read: అతిపెద్ద ప‌వ‌ర్ బ్యాంక్‌…ఒకేసారి…

త‌న కుమారుడు పెద్ద‌లు ఇచ్చిన ఆస్తిని దుర్వినియోగం చేస్తున్నాడ‌ని, వెంట‌నే త‌న ఆస్తిని వెంట‌నే తిరిగి ఇచ్చేయ్యాల‌ని కోర్టులో కేసు ఫైల్ చేశాడు. పురాత‌న ఆస్తుల‌ను కాపాడుకోలేక‌పోతున్నాడ‌ని ఆగ‌స్ట్ పేర్కొన్నారు. అయితే, తండ్రి వేసిన దావాకు ఆర్హ‌త లేద‌ని, కోర్టు కూడా అదే విధంగా చెప్పింద‌ని యువ‌రాజు పేర్కొన్నారు.