Site icon NTV Telugu

Pink Diamond: ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన వ‌జ్రం…

ప్ర‌పంచంలో వ‌జ్రాలు ఎంతో విలువైన‌వి. మామూలు వ‌జ్రాలు సైతం ల‌క్ష‌ల రూపాయ‌ల్లో ఉంటాయి. ఇక అరుదైన వ‌జ్రాల సంగ‌తి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అరుదైన వ‌జ్రాలు కోట్ల రూపాయ‌ల్లో ఉంటాయి. ఇటీవ‌లే హాంకాంగ్‌లో ఓ పింక్ వ‌జ్రాన్ని వేలం వేశారు. ది స‌కురా పేరుతో ఉన్న ఈ వ‌జ్రం బ‌రువు 15.8 క్యారెట్లు ఉంది. అరుదైన ఈ పింక్ వ‌జ్రం 29.3 మిలియ‌న్ డాల‌ర్ల‌కు అమ్ముడుపోయింది. ఈ విష‌యాన్ని ఆక్ష‌న్‌.హౌస్ తెలియ‌జేసింది. ఈ పింక్ వ‌జ్రానికి ప్లాటినం, బంగారు ఉంగ‌రం జ‌త చేశారు.

Read: Hyderabad: హైదరాబాద్‌లో ఆ వాహ‌నాల‌కు ఇక‌పై నో ఎంట్రీ…

అయితే, ఈ వ‌జ్రం రంగు ప్రకాశ‌వంత‌మైన‌దికాద‌ని, ఈ వ‌జ్రంలోని గులాబి రంగు కేవ‌లం మైక్రోస్కోపు నుంచి మాత్ర‌మే క‌నిపిస్తుంద‌ని నిర్వ‌హ‌కులు పేర్కొన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అమ్ముడుపోయిన వ‌జ్రాల్లో అత్యంత ఖ‌రీదైన వ‌జ్రంగా ది స‌కురా పేరు గాంచిన‌ట్టు నిర్వ‌హాకులు పేర్కొన్నారు.

Exit mobile version