Site icon NTV Telugu

Viral: మ‌ళ్లీ 11 ఏళ్ల త‌రువాత‌…

ఈ రోజుకు ఓ ప్ర‌త్యేక‌త ఉంది. 22, ఫిబ్ర‌వ‌రి 2022… దీనిని 2-2-22 గా కూడా పిలుస్తారు. పైగా ఈరోజు ఆంగ్ల క్యాలెండ‌ర్ ప్ర‌కారం ట్యుస్ డే. అయితే, ఈరోజు తేదీలో అన్నీ 2 అంకెలు ఉండ‌టంతో టూస్ డే అని కూడా పిలుస్తున్నారు. ఉద‌యం నుంచి Twosday అనే ప‌దం ట్రెండ్ అవుతూ వ‌స్తున్న‌ది. తేదీ, నెల‌, సంవ‌త్సం అన్నీ ఒకే నెంబ‌ర్‌తో వ‌స్తే దానిని సిమ్మెట్రిక‌ల్ లేదా పాలిండ్రోమ్ అని పిలుస్తారు. ముందు, వెనుక ఎటు నుంచి చ‌దివినా ఒకే విధంగా నెంబ‌ర్లు క‌నిపిస్తాయి. అందుకే దీనిని సిమ్మెట్రిక‌ల్ నెంబ‌ర్స్ అని పిలుస్తారు.

Read: Swiggy IPO: 800 మిలియ‌న్ డాల‌ర్ల సేక‌ర‌ణే ల‌క్ష్యంగా…

2 అంకెతో వ‌చ్చే ఇలాంటి నెంబ‌ర్‌ను మ‌నం చూడాలి అంటే మ‌రో రెండు వంద‌ల సంవ‌త్సారాలు ఆగాల్సిందే. ఇలాంటి సిమ్మెట్రిక‌ల్ నెంబ‌ర్ 11 జ‌న‌వ‌రి 2011లో వ‌చ్చింది. ఇందులో అంకెలు 1-1-11గా ఉంటుంది. ఇప్పుడు 2-2-22 అంకెలు రాగా, మ‌రో 11 ఏళ్ల త‌రువాత 3-3-33 అంకెలు వ‌స్తాయి. ఈ పాలిడ్రోమ్ అంకెల‌ను చాలా మంది సెల‌బ్రెట్ చేసుకుంటుంటారు. స్పెష‌ల్ డే కావ‌డంతో జీవితంలో గుర్తుండిపోయేలా కొంద‌రు ప్లాన్ చేసుకొని ఎంజాయ్ చేస్తుంటారు.

Exit mobile version