రైల్వేశాఖలో ఉపయోగంలో లేని పాత బోగీల సంఖ్య పేరుకుపోతున్నాయి. పాత రైల్వే బోగీలను వినియోగించేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఉపయోగం లేని బోగీలను రెస్టారెంట్లుగా మార్చాలని రైల్వేశాఖ నిర్ణయం దీసుకుంది. పాత బోగీలకు రంగులు వేసి రెస్టారెంట్లుగా మార్చే ప్రక్రయను చేపట్టింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో పాత రైల్వే బోగీలను మొదటగా రెస్టారెంట్‌గా మార్చింది. ఈ బోగీ రెస్టారెంట్ ఆకట్టుకోవడంతో రైల్వేశాఖ మరికొన్ని రైల్వే బోగీలను రెస్టారెంట్‌లుగా మార్చాలను నిర్ణయించింది. ప్రస్తుతం ఈ బోగీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రెస్టారెంట్ ఓపెన్ అయ్యాక దీని ద్వారా సంవత్సరానికి సుమారు రూ. 13 లక్షల రూపాయల ఆదాయం లభిస్తుందని రైల్వేశాఖ అంచనా వేస్తున్నది. ఇదంతా నాన్‌ఫెయిర్ ఆదాయమని రైల్వేశాఖ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నది.
Read: మంచిర్యాల నుండి మేడారంకు బస్సు సర్వీసులు