దేశంలో క్రికెట్ కు ఎంతటి ఆదరాభిమానాలు ఉన్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ గేమ్ ఇంగ్లాండ్‌లో పుట్టినప్పటికీ ఉపఖండంలోనే ఫేమస్ అయింది. ఆరేళ్ల చిన్నారి నుంచి 60 ఏళ్ల పెద్దవాళ్ల వరకు క్రికెట్‌ను అమతంగా ఇష్టపడుతుంటారు. పెద్దవాళ్లు సైతం అప్పుడప్పుడు బ్యాట్ చేతపట్టి వావ్ అనిపిస్తుంటారు. ఇలానే ఓ పెద్దాయన బ్యాట్ పట్టుకొని కుర్రాళ్లకు ఏ మాత్రం తీసిపోమని చెబుతూ క్రికెట్ అడాడు. పరుగులు తీశాడు. బ్యాట్ పట్టింది మొదలు ఆ పెద్దాయన తన వయసును మర్చిపోయి ఎనర్జిటిక్‌గా గేమ్ ఆడాడు. దీనికి సంబంధించిన చిన్నవీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది. వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అదరగొట్టేశావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Read: కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు: యూరప్‌కు అమెరికా సైన్యం… బెలారస్‌కు రష్యా సైన్యం
