ప్రస్తుత సోషల్ మీడియా యుగం నడుస్తోంది. రీల్స్, ఫాలోవర్స్, లైక్స్ పిచ్చి పీక్స్ కి చేరుకుంటోంది. రీల్స్, వ్లాగ్స్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కొందరు ప్రాణాలతో చెలగాటాలాడుతూ.. విన్యాసాలు చేస్తున్నారు. మరి కొందరు మాత్రం నాలుగు గోడల మధ్య చేయాల్సిన పనుల్ని బహిర్గతం చేస్తూ.. కుటుంబ పరువును రోడ్డు కీడుస్తున్నారు. తాజాగా ఓ జంట అడుగు ముందుకేసి తమ బెడ్‌రూం విషయాలను కూడా బయట పెట్టుకుంటున్నారు. పెళ్లయిన ఓ జంట శోభనం గదిలో వ్లాగ్స్ చేసింది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎక్కువ మందిని ఆకర్షించేందుకు చేసి ఈ ప్రయత్నం ప్రస్తుతం ఆ జంట తలదించుకునేలా చేసింది. నూతనంగా
READ MORE: Bharateeyudu-2 Prerelease Event: కమల్ ముందే ఆయన గొంతు మిమిక్రీ చేసిన బ్రహ్మానందం
ఈ వీడియోలో కొత్తగా పెళ్లైన జంట.. అందరంగా అలంకరించిన శోభనం గదిలో ఉండగా.. వరుడు.. ఫోన్ కెమెరా తీసి.. వీడియో ఆన్ చేసి.. తన భార్యను పిలిచి నెటిజన్లకు పరిచయం చేశాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. వీడియోలో.. ‘హాయ్ ఫ్రెండ్స్.. ఈ రోజు ఫస్ట్ నైట్ జరగబోతోంది.. పూలతో ఎంతో అందంగా అలంకరించారు. ఇదిగో ఈమే నా భార్య. ఈ రోజే మాకు వివాహం జరిగింది.’ అంటూ భార్యను పరిచయం చేస్తాడు. ఆమె కూడా ఎలాంటి మొహమాటం లేకుండా నెటిజన్లకు హాయ్ చెప్పింది. అనంతరం నూతన వరుడు శోభనం రాత్రి డెకరేషన్ ఎలా ఉంది అంటూ ఆమెను ప్రశ్నిస్తాడు. భార్యకు లిప్ కిస్ పెట్టాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ఏంట్రా బాబు ఈ అరాచకం అంటూ రాసుకొస్తున్నారు. ఈ వీడియోకు విపరీతమైన వస్తున్నాయి.
Suhagraat Vlog 🥴
These vloggers have gone totally mad.
Wait for the blurred clip 😹 pic.twitter.com/PMsiC5dS6U
— Sunanda Roy 👑 (@SaffronSunanda) July 5, 2024