NTV Telugu Site icon

Minister Dances Video Viral: భారీకాయం అడ్డు కాదు..! సాంప్రదాయ నృత్యంతో ఆకట్టుకున్న మంత్రి..

Temjen Imna Along

Temjen Imna Along

భారీకాయం ఉంటే.. కొందరు పది మందిలో కలవడానికి.. ఏదైనా సందర్భంలో ఆడటానికి పాడడానికి బిడియపడుతుంటారు.. భారీ శరీరం వాటికి అడ్డుకాకపోయినా.. వారిలో అది కేవలం తెలియని పీలింగ్‌ మాత్రమే కావొచ్చు.. అయితే, తాజాగా, ఓ మంత్రి సాంప్రదాయ నృత్యంతో ఆకట్టుకున్నారు.. నాగాలాండ్‌ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాగాలాండ్‌ బీజేపీ చీఫ్, గిరిజన వ్యవహరాల మంత్రి టెంజెన్‌ ఇమ్నా.. తాజాగా, గిరిజనులతో కలిసి కాలు కదిపారు. భారీకాయాన్ని సైతం లెక్కచేయకుండా.. డ్యాన్స్‌ చేసి ఆకట్టుకున్నారు.. ఆ రాష్ట్రంలో జరుపుకునే సుంగ్రెమాంగ్‌ పండుగలో పాల్గొన్న ఆయన.. వేడుకల్లోగిరిజనులతో కలిసి సాంప్రదాయక నృత్యాన్ చేశారు.. కొన్ని స్టెప్పులకు కాస్త ఇబ్బంది పడినా.. అదేమీ పట్టించుకోకుండా.. చిరునవ్వులు చిందిస్తూ.. కాలు కదిపారు.. అయితే, అక్కడున్న ఓ వ్యక్తి ఆ దృశ్యాలను మొబైల్‌లో బంధించగా.. ఆ వీడియోను తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేసిన మంత్రి టెంజెన్‌ ఇమ్నా అలోంగ్.. ‘చూడండి.. నేను కూడా డ్యాన్స్‌ చేయగలను.’ అని పేర్కొన్నారు. దీంతో, ఆ విడియో కాస్తా వైరల్‌గా మారిపోయింది.

Read Also: Amit Shah: మోదీ నాయకత్వంలో కొత్త భారత్ రూపుదిద్దుకోనుంది

అంతకుముందు, తన పరివారంతో కలిసి నాగాలాండ్‌లోని ఉంగ్మా గ్రామానికి చేరుకున్న మంత్రి.. స్థానికులతో కలిసి అయో నాగా పండుగ సుంగ్రేమోంగ్ జరుపుకున్నారు.. సుంగ్రేమోంగ్ ఫెస్టివల్ వేడుకలో ఉంగ్మా విలేజ్ సభ్యుల నుండి లభించిన సాదర స్వాగతం చూసి ఉబ్బితబ్బిబ్బవుతున్నాను. పండుగకు హాజరై వేడుకలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉందన్నారు.. సుంగ్రేమోంగ్ సేలం!”, అని అలాంగ్ సోషల్ మీడియాలో రాశారు. సంప్రదాయబద్ధంగా దుస్తులు ధరించిన యువకులతో కాలు కదపమని కోరడంతో, అలోంగ్ సిగ్గుపడలేదు మరియు తన సామర్థ్యం మేరకు ప్రదర్శన ఇచ్చారు.. ఇక, ఈ పండుగనుద్దేశించి మాట్లాడుతూ.. నాగాలు.. పంటలు బాగా పండాలని జరుపుకునే పండుగ ఇది. సంస్కృతీ, సంప్రదాయాలకు నిలువుటద్దంగా ఈ ఫెస్టివల్‌ నిలుస్తుంది. నాగాలాండ్‌ సంస్కతిని చూడాలనుకునేవారు అక్కడికి వెళ్లండి అని సూచించారు.