Site icon NTV Telugu

Cool Attitude : ఏం గుండెరా వాళ్లది.. వరదలోనూ వదులుకోని చిల్‌ మూడ్‌.. (వీడియో)

Mumbai Rains

Mumbai Rains

Cool Attitude : భారీ వర్షాల కారణంగా ముంబై వరద ముంపులో కూరుకుపోయింది. రోడ్లు, ఇళ్లు నీటమునిగిపోయి నగరం మొత్తం తీవ్ర ఇబ్బందులు పడుతున్న సందర్భంలో, సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కనిపించిన ఇద్దరు వ్యక్తులు మాత్రం పూర్తిగా కూల్‌ మూడ్‌ లో ఉండటమే కాకుండా, అందరినీ ఆశ్చర్యపరిచారు. వీరిద్దరూ ఇంటి ముందు వరద నీరు పొంగిపొర్లుతున్నా ఎలాంటి భయంకర వాతావరణం పట్టించుకోకుండా కుర్చీలు పెట్టుకుని కూర్చుని గుసగుసాడుతూ సరదాగా మద్యం గ్లాసులు ఆస్వాదిస్తూ కనిపించారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఆందోళన చెందుతూ సురక్షిత ప్రాంతాలకు తరలిపోతుంటారు. కానీ ఈ వ్యక్తులు మాత్రం పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తూ “టెన్షన్‌ వద్దు, ఎంజాయ్‌ చేయాలి” అన్నట్టుగా టైమ్‌పాస్ చేశారు.

80W ఫాస్ట్ ఛార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇప్పుడు మిడ్ సెగ్మెంట్లో.. భారీ డిస్కౌంట్తో Realme P4 Pro 5G లాంచ్!

ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ కావడంతో క్షణాల్లోనే వైరల్ అయింది. నెటిజన్లు తమ తమ రియాక్షన్లు చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు “ఇంతటి సీరియస్ సిట్యూయేషన్‌లో కూడా ఇలా చిల్‌గా కూర్చోవడం నిజంగా ఆశ్చర్యమే” అని స్పందిస్తుండగా, మరికొందరు “ముంబయికర్లకు ఒత్తిడి, కష్టాలు కొత్తేమీ కావు.. అందుకే ఇలా అలవాటు అయిపోయారు” అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. మరోవైపు కొందరు నెటిజన్లు వీరి ధైర్యాన్ని ప్రశంసిస్తుండగా, ఇంకొందరు మాత్రం “ఇది నిర్లక్ష్యం.. భద్రతను విస్మరించడం” అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయినా కూడా, ఆ ఇద్దరి వ్యక్తుల కూల్ స్వభావం, కష్టసమయంలోనూ ఫుల్ ఎంజాయ్ చేసిన తీరు నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

Lok sabha: లోక్‌సభ ముందుకు 3 కీలక బిల్లులు.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు

Exit mobile version