NTV Telugu Site icon

పాప ఏడుస్తుందంటూ మ‌హిళ ట్వీట్‌… వెంట‌నే స్పందించిన రైల్వేశాఖ‌…

సామాజిక మాధ్య‌మాలు అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నా వెంట‌నే అందులో పోస్ట్ చేస్తున్నారు.  దానికి అనుగుణంగానే అవ‌త‌లి వ్య‌క్తులు కూడా రెస్పాండ్ అవుతున్నారు.  క‌రోనా స‌మ‌యంలో సామాజిక మాధ్య‌మాల వినియోగం బాగా పెరిగింది.  సాధార‌ణ ప్ర‌జ‌ల నుంచి రాజ‌కీయ నేత‌లు, మంత్రుల వ‌ర‌కు ప్రతి ఒక్క‌రూ ట్విట్టర్‌లో అందుబాటులో ఉంటున్నారు.  ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌చ్చినా వెంట‌నే రెస్పాండ్ అవుతూ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తున్నారు.  యూపీలోని సుల్తాన్‌పూర్‌కు చెందిన మ‌హిహ ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌లో ప్ర‌యాణం చేసే స‌మ‌యంలో త‌న 8 నెల‌ల చిన్నారి పాల‌కోసం గుక్క‌ప‌ట్టి ఏడ్చింది.  ఎంత స‌ముదాయించినా లాభం లేక‌పోయింది.

Read: గుడ్ న్యూస్‌: హిమాల‌యాల్లోని మొక్క‌ల‌తో క‌రోనాకు చెక్…!!

పాప ఏడుస్తోంది… పాలు కావాల‌ని చెప్పి రైల్వే శాఖ‌కు ట్వీట్ చేసింది.  వెంట‌నే స్పందించిన రైల్వే శాఖ మంత్రి అశ్విన్ కుమార్ పాపకు పాలు అందించాల‌ని ఆదేశాలు జారీ చేశారు.  భీమ్‌సేన్ స్టేష‌న్ నుంచి రైలు బ‌య‌లుదేరి కాన్పూర్ రైల్వేస్టేష‌న్‌కు చేరుకున్న వెంట‌నే అధికారులు పాప త‌ల్లికి పాలు అంద‌జేశారు.  వెంట‌నే స్పందించి పాలు అంద‌జేసిన రైల్వేశాఖ మంత్రి అశ్విన్ కుమార్‌కు ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.