Site icon NTV Telugu

Viral Video: గర్ల్‌ ఫ్రెండ్‌తో పేరెంట్స్‌కు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన కొడుకు.. తల్లి ఏం చేసిందో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Viral Video

Viral Video

Viral Video: ప్రేమికుల దినోత్సవం (Valentine’s Day) ప్రతి ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన జరుపుకొంటారు.. విదేశాలతో పాటు భారత్‌లోనూ ఈ యువత ఈ సంస్కృతికి ఆకర్శితులవుతున్నారు. ఇళ్లలో తల్లిదండ్రులకు తెలియకుండా కాలేజీలు, ఆఫీస్ పనుల పరుతో చెట్టాపట్టాలేసుకుంటూ తిరుగుతారు. ఫిబ్రవరి 14వ తేదీని వారం రోజుల ముందు నుంచే ఈ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకుని ఉంటారు. అంటే ఫిబ్రవరి 7న రోజ్‌డేతో మొదలై 14న ప్రేమికుల దినోత్సవం వరకు లవర్లు ఎక్కడ పడితే అక్కడ తారసపడుతుంటారు. రెస్టారెంట్లు, సినిమా హాల్లు, పబ్బుల్లో జంటలు దర్శనమిస్తుంటాయి. అటు అబ్బాయి, ఇటు అమ్మాయి వారి తల్లిదండ్రులకు తెలియకుండా జాగ్రత్తపడుతుంటారు. ఒకవేళ పేరెంట్స్‌కి వీళ్ల విషయం తెలిస్తే.. తల్లికి కుమారుడు తన లవర్‌తో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికితే? ఏం జరుగుతుంది? అని ఎప్పుడైనా ఆలోచించారా? అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా చోటు చేసుకుంది.

READ MORE: Tollywood : ఫేడవుటౌతున్న దర్శకులకు ఛాన్సులిస్తున్న హీరోలు

ఓ తల్లి తన కుమారుడిని మెట్రోస్టేషన్‌లో చూసింది. తన కొడుకు పక్కన ఓ యువతి ఉంది. ఆ యువతి ఎవరో కాదు.. తన కుమారుడి గర్ల్‌ఫ్రెండ్‌ అని గుర్తించింది. దీంతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అదే రైల్వే స్టేషన్‌లో వారికి ఎంగేజ్‌మెంట్ జరిపింది. వారి సాంప్రదాయ పద్దతిలో యువతికి పళ్లు పెట్టి, స్వీట్లు పంచింది. ఇక్క విశేషం ఏంటంటే.. ఆ యువకుడి తల్లి మాత్రమే కాదు.. తండ్రి సైతం పక్కనే ఉన్నాడు. ఈ ఘటనను మొత్తం ఆయన మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. అంతే కాదు.. తన కుమాడి లవర్‌ని కోడలిగా అంగీకరించిన తండ్రి వారిని స్టేషన్‌లోనే ధీవిస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకున్నందుకు ఆ యువకుడు చాలా అదృష్ట వంతుడు అని కొందరు కామెంట్స్ చేశారు. ఆ యువతి ఎంతో లక్కు చేసుకుంది. ఆమె అత్తామామలు ఎంత మంచివాళ్లో ఈ వీడియోలోనే అర్థమవుతుందని మరో నెటిజన్ పేర్కొన్నారు. ఈ వీడియోకు ఇప్పటికే వేలల్లో లైక్స్ వచ్చాయి. లక్షల్లో నెటిజన్లు వీక్షించారు.

Exit mobile version