వాలంటైన్ డే రోజున ప్రేమికులు ప్రపోజల్స్ చేసుకుంటూ ఉంటారు. ఇది కామన్‌గా జరిగే ప్రాసెస్. అయితే, అందరికంటే ఢిఫరెంట్ గా ఉండేందుకు, వార్తల్లో నిలిచిపోయేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు. అలాంటి ఘటన ఒకటి ప్రేమికుల దినోత్సవం రోజున జరిగింది. మేరీ లీ అనే మహిళ సీబీఎస్ శాన్ ఫ్రాన్సిస్కోలో వాతావరణవేత్తగా పనిచేస్తున్నది. వాతావరణానికి సంబందించిన రిపోర్ట్‌ను స్టూడియోలో ఉత్తర భాగంలోని లైట్స్ గురించి లైవ్ రిపోర్ట్ ఇస్తుండగా, ఆమె లాంగ్‌టైమ్ బాయ్‌ఫ్రెండ్ అజిత్ నినాజ్ ఆమెకు సర్ప్రైజ్ ఇచ్చాడు.
Read: Bajaj Scooter: బజాజ్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్…
డైరెక్ట్‌గా లైవ్ జరుగుతున్న స్టూడియోలోకి వచ్చి రోజ్ బుకేను ఇచ్చారు. ఆ తరువాత మోకాళ్లపై కూర్చొని రింగ్ ఇస్తూ ప్రపోజ్ చేశాడు. దీంతో మేరీ లీ షాక్ అయ్యింది. అజిత్ ప్రపోజ్ కు నో చెప్పలేకపోయింది. అప్పటికే ఇద్దరూ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. సడెన్ గా సర్ప్రైజ్ చేస్తూ స్టూడియోలోకి వచ్చి ప్రపోజ్ చేయడంతో మేరీ లీ కంటతడి పెట్టింది. ఈ ఆద్బుతమైన దృశ్యాలను సీబీఎస్ శాన్‌ఫ్రాన్సిస్కో కట్ చేయకుండా లైవ్ చేయడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నది.
