Viral News: 10 మంది అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్ల కోసం తమ్ముడు ఏం చేశాడో తెలిస్తే సెల్యూట్ చేస్తారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral News : పది మంది అక్కాచెల్లెళ్లకు ఒక్క తమ్ముడిగా పుట్టిన ఓ యువకుడి కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో లక్షల మందిని కదిలిస్తోంది. తండ్రికి ఇచ్చిన మాట కోసం తన వ్యక్తిగత జీవితం, ఆర్థిక భద్రత, భవిష్యత్తు అన్నింటినీ పణంగా పెట్టిన అతని పరిస్థితి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఆ యువకుడు తన కుటుంబ కథను వివరించాడు. తన తండ్రికి వరుసగా పది మంది కుమార్తెలు పుట్టారని, చివరకు ఒక మగ సంతానం కోసం ఆశగా ఎదురుచూసిన తర్వాత తాను జన్మించానని చెప్పాడు. అయితే కుటుంబ పరిస్థితులను మార్చేసిన సంఘటన తన తండ్రి క్యాన్సర్‌తో పోరాడుతున్న సమయంలో జరిగిందని వివరించాడు.
తన తండ్రి చివరి రోజుల్లో తనను పిలిచి ఒక మాట ఇవ్వాలని కోరినట్లు ఆ యువకుడు తెలిపాడు. తన పది మంది అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్ల బాధ్యత మొత్తం తానే తీసుకోవాలని, బంధువుల సహాయం అడగకుండా, బాధ్యతను ఎవరితోనూ పంచుకోకుండా వారి వివాహాలను స్వయంగా నిర్వహించాలని తండ్రి కోరాడని చెప్పాడు. ఆ సమయంలో పరిస్థితుల తీవ్రత అర్థం కాకుండా తండ్రికి మాట ఇచ్చానని, అయితే ఆ మాట భవిష్యత్తులో ఎంతటి ఆర్థిక భారంగా మారుతుందో ఊహించలేదని వివరించాడు.
Also Read
- Paraglider: మహిళా పారాగ్లైడర్ గాల్లో ఉండగానే.. పారాచూట్ మధ్య నుంచి దూసుకెళ్లిన విమానం.. చూస్తే ఊపిరి ఆడదు (వీడియో)
- Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
- Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
- Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
ఇప్పటివరకు తన ముగ్గురు అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్లు పూర్తి చేశానని, అయితే ఆ ప్రక్రియలో ఇప్పటికే రూ.35 లక్షల వరకు అప్పుల్లో కూరుకుపోయానని అతడు వెల్లడించాడు. వివాహ వేడుకలు, బహుమతులు, కుటుంబ సంప్రదాయాలు, ఇతర ఖర్చులు అన్నీ కలిపి భారీ ఆర్థిక భారం పడిందని చెప్పాడు. ఇంకా ఏడుగురు అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్లు మిగిలి ఉన్నాయని, వాటిని కూడా అదే విధంగా నిర్వహించాలంటే రాబోయే సంవత్సరాల్లో మరో రూ.2 నుంచి రూ.3 కోట్ల వరకు అవసరం కావచ్చని అంచనా వేశాడు.
అయితే తన పరిస్థితిని వివరిస్తూనే అతడు చిరునవ్వుతో చెప్పిన ఆ మాటలు నెటిజన్స్ ని మరింత భావోద్వేగానికి గురి చేసింది. అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్లు పూర్తయి అప్పులు మిగిలి ఉంటే ఆ తర్వాత తాను పెళ్లి చేసుకుంటానని సరదాగా చెప్పాడు. తనకు పిల్లలు పుట్టే సమయానికి తాను అరవై లేదా డెబ్బై ఏళ్ల వయసులో ఉండొచ్చని, అప్పటికి తన పిల్లలు చిన్నారులుగానే ఉంటారని వ్యాఖ్యానించాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. ఎంతోమంది అతని త్యాగాన్ని, కుటుంబం పట్ల చూపుతున్న నిబద్ధతను ప్రశంసించారు. కుటుంబ బాధ్యత అంటే ఇదేనని, తండ్రి చివరి కోరికను నెరవేర్చేందుకు ఇంతటి భారాన్ని భుజాన వేసుకోవడం అరుదైన విషయమని పలువురు వ్యాఖ్యానించారు. మరోవైపు కొందరు మాత్రం ఈ స్థాయిలో ఆర్థిక భారం మోసుకోవడం సరైన నిర్ణయమా అనే ప్రశ్నను లేవనెత్తారు. కుటుంబం కోసం జీవించడం గొప్ప విషయమే అయినా, వ్యక్తిగత భవిష్యత్తు, ఆర్థిక స్థిరత్వం కూడా అంతే ముఖ్యమని అభిప్రాయపడ్డారు.
ఈ కథ కేవలం ఒక యువకుడి అప్పుల కథ కాదు. కుటుంబ బంధాలు, తల్లిదండ్రులకు ఇచ్చిన మాట, బాధ్యత అనే భావన ఎంత బలంగా మనుషుల జీవితాలను ప్రభావితం చేస్తుందో చూపించే ఉదాహరణగా నిలుస్తోంది. ఒకవైపు తండ్రి చివరి కోరికను నెరవేర్చాలనే సంకల్పం కనిపిస్తుంటే, మరోవైపు ఆ బాధ్యత కోసం ఒక వ్యక్తి తన జీవితంలోని ఎన్నో కలలను వాయిదా వేసుకోవాల్సి వస్తున్న వాస్తవం కూడా ఇందులో కనిపిస్తోంది. అందుకే ఈ వీడియోను చూసిన వారిలో కొందరికి ఇది స్ఫూర్తిదాయక కథగా అనిపిస్తే, మరికొందరికి ఇది బాధ్యతల భారంతో నిండిన విషాద గాథగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Viral News: 10 మంది అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్ల కోసం తమ్ముడు ఏం చేశాడో తెలిస్తే సెల్యూట్ చేస్తారు..!
-
Vaibhav Sooryavanshi: భవిష్యత్ అంతా వైభవ్‌దే.. వరల్డ్ కప్‌లో సూర్యవంశీకి చోటు..
-
Indian Navy Recruitment 2026: భారత నావికాదళంలో బీటెక్ క్యాడెట్ ఎంట్రీకి దరఖాస్తులు.. అర్హత, ఎంపిక వివరాలు ఇవే
-
Gopichand 34 : పట్టాలెక్కిన గోపీచంద్ 34వ మూవీ… షూటింగ్ అప్డేట్
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
ట్రెండింగ్
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!