Site icon NTV Telugu

Viral: కాలుజారి కింద‌ప‌డ్డాడు… స‌మ‌య‌స్పూర్తితో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు…

అపాయం క‌లిగిన‌పుడే ఉపాయం ఆలోచించాలి. మెద‌డు షార్ప్‌గా ప‌నిచేయాలి. లేదంటే ప్రాణాల‌కు ప్ర‌మాదం ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. చాలా మంది తాము ప్ర‌మాదంలో చిక్క‌కున్నామ‌ని తెలిసిన వెంట‌నే ఏం చేయాలో తెలియ‌క కాళ్లు చేతులు వ‌ణికిపోతాయి. ఆ స‌మ‌యంలో ఆలోచ‌న‌లు ఆగిపోతాయి. పొంచిఉన్న ప్ర‌మాదం దూరంగా ఉన్న‌ప్ప‌టికీ ద‌గ్గ‌రికి వ‌చ్చేస్తుంద‌ని భావించి త‌ప్పించుకోలేక దానికి చిక్కి జీవితాన్ని నాశ‌నం చేసుకుంటాము.

Read: Russia-Ukraine War: భ‌యాందోళ‌న‌లో ఉక్రెయిన్ ప్ర‌జ‌లు… ర‌ష్యా ఆ బాంబును ప్ర‌యోగిస్తుందా?

అయితే, బీహార్‌లోని పాట్నాకు చెందిన ఓ వ్య‌క్తి ధైర్యంగా, స‌మ‌య‌స్పూర్తితో వ్య‌వ‌హ‌రించి వెంట్రుక‌వాసిలో ప్రమాదం నుంచి త‌ప్పించుకున్నాడు. పాట్నా రైల్వేస్టేష‌న్‌లో రైలుకోసం ఎదురు చూస్తున్న ఓ వ్య‌క్తి రైలు ప్లాట్ ఫామ్ మీద‌కు వ‌చ్చేముందు కాలుజారి కింద‌ప‌డ్డాడు. రైలు ప‌ట్టాల‌పై ప‌డటం, దూరం నుంచి రైలు దూసుకురావ‌డంతో ఆ వ్య‌క్తి స‌మ‌య‌స్పూర్తితో వ్య‌వ‌హరించి రైలు ప‌ట్టాల‌పై బోర్లా ప‌డుకుండిపోయాడు. రైలు వెళ్లిపోగానే ఆ వ్య‌క్తి మెల్లిగా లేచి బ‌య‌ట‌కు వ‌చ్చాడు. రైల్వే ఫ్లాట్‌ఫామ్‌పై ఉన్న వ్య‌క్తులు ఆ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు.

Exit mobile version