Site icon NTV Telugu

Man Push-Up On Moving Truck: రన్నింగ్‌ ట్రక్కుపై హీరోలా పోజులు.. చివరకు ఇలా..!

Man Push Up

Man Push Up

కొన్ని ప్రమాదాలు అనుకోకుండా జరుగుతాయి.. మరికొన్ని కొనితెచ్చుకునేటివి ఉంటాయి.. అలాంటి ప్రమాదమే ఓ యువకుడికి ఎదురైంది.. రన్నింగ్‌ ట్రక్‌పై హీరోలా పోజులిచ్చిన ఓ యువకుడు.. చివరకు పట్టుతప్పి.. ఆ రన్నింగ్‌ ట్రక్‌పై నుంచి కొందపడిపోయాడు.. తీవ్రగాయాలపాలయ్యాడు.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.. అయితే, సదరు యువకుడు చెత్తే సేకరించే వాహనంపై చేసిన ప్రమాదకరమైన విన్యాసాలు.. అతడి అదుపుతప్పి కొందిపడిపోయిన క్షణాలు అన్నీ.. ఆ వాహనం వెనుక కారులో వెళ్తున్న ఓ వ్యక్తి షూట్‌ చేశాడు.. అది సోషల్‌ మీడియాకు ఎక్కడంతో.. వైరల్‌గా మారిపోయింది..

Read Also: Indiana Mall Shooting: అమెరికాలోని ఇండియానా మాల్‌లో కాల్పులు.. నలుగురు మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లక్నోలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శనివారం రాత్రి సమయంలో.. లక్నో రోడ్డుపై ఓ చెత్త సేకరించే వాహనం దూసుకుపోతోంది.. అయితే, ఆ వాహనంపై ఉన్న యువకుడు.. ట్రక్‌ రన్నింగ్‌లో ఉన్న విషయాన్ని వదిలి.. ప్రమాదకరమైన విన్యాసాలు చేశాడు.. మొదట లేని నిలిచున్నాడు.. ఆ తర్వాత పుష్అప్స్ చేశాడు.. ఆ వాహనం వేగంగా వెళ్తున్నప్పటికీ నిర్లక్ష్యంగా స్టంట్స్ చేయసాగాడు.. పుష్‌అప్స్ తర్వాత.. ఇంకా ఏదో చేయడానికి ప్రయత్నం చేశాడు.. కానీ, అతడ ఉత్సాహం తలకిందులైంది.. అదుపుతప్పి వాహనం పై నుంచి జారి కిందపడిపోయాడు.. ఆ సమయంలో.. వాహనాన్ని పట్టుకునేందుకు ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది.. మొత్తంగా రన్నింగ్‌ వాహనం నుంచి రోడ్డుపై పడిపోయాడు.

అయితే, ఆ సమయంలో వెనుక నుంచి ఎలాంటి భారీ వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పిందని చెప్పాలి.. కానీ, రన్నింగ్‌ ట్రక్కుపై హీరోలా పోజులిచ్చి మాత్రం.. తన ప్రాణాలపైకి తెచ్చుకున్న యువకుడు.. తీవ్రగాయాలపాలై.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.. ఇక, యువకుడు స్టంట్స్‌, ప్రమాదానికి గురైన వీడియోను సీనియర్‌ పోలీస్‌ అధికారి శ్వేత శ్రీవాస్తవా.. తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు.. ‘శక్తిమాన్‌లా కాదు.. బుద్ధిమాన్‌లా ఉండు..”అంటూ కామెంట్‌ పెట్టారు.. మొత్తంగా ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.

Exit mobile version