NTV Telugu Site icon

Pune: మూడంతస్తుల బిల్డింగ్‌లో భారీ అగ్నిప్రమాదం.. చిన్నారుల సాహస దృశ్యాలు వైరల్

Punefire

Punefire

మహారాష్ట్రలోని పూణె నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. హదప్సర్ ప్రాంతంలోని మూడంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. బిల్డింగ్ మధ్య ప్రాంతంలో మంటలు ఎగిసిపడుతుండగా పక్క ఫోర్సన్‌లో ఇద్దరు చిన్నారులు చిక్కుకుపోయారు. నీళ్లు తెచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఏ మాత్రం కంట్రోల్‌ కాలేదు. క్రమక్రమంగా మంటలు భారీగా పెరిగిపోయాయి. దీంతో ఓ చిన్నారి దిగే ప్రయత్నం చేసినా కుదరలేదు. దీంతో సమీపంలో ఉన్న స్థానికులు గోడల మీద నుంచి ఎక్కుకుంటూ ఇద్దరు చిన్నారులను రక్షించారు. మరికొందరు మెట్ల మీద నుంచి తప్పించుకుని బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రస్తుతం మంటలు అదుపులో ఉన్నాయని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పూణె అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

ఇది కూడా చదవండి: Varun Tej : మట్కా సినిమాకు దారుణమైన కలెక్షన్స్.. కారణం ఏంటి..?

గురువారం జరిగిన ఈ అగ్నిప్రమాదానికి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్థానికులు.. అంతస్తు పైకి ఎక్కి చిన్నారులను రక్షించిన విధానాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి.. బాల్కనీ నుంచి చిన్నారులను రక్షించారు. ఇంకోవైపు పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నా.. ఏ మాత్రం భయపడకుండా సాహసం చేశారు. ఇదిలా ఉంటే అసలు మంటలు ఎలా అంటుకున్నాయన్న విషయం ఇంకా తేలలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అన్వేషిస్తున్నారు.

ఇది కూడా చదవండి: GST Meeting: డిసెంబర్ 21న జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్.. 2025-26 బడ్జెట్‌పై కసరత్తు