Matka : ‘వరుణ్ తేజ్’ మేల్కోవాల్సిన టైమ్ వచ్చిందా..?
- వరుణ్ తేజ్ మట్కా కు మిశ్రమ స్పందన
- మరో ప్లాప్ ను ఖాతలో వేసుకున్న వరుణ్ తేజ్
- మినిమం ఓపెనింగ్ రాబట్టని మట్కా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్ తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటించారు. కంగువతో పాటుగా ఈ గురువారం విడుదలయింది మట్కా. కానీ మట్కా కంటే కంగువకె ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి.
Also Read : Pongal Movies : సంక్రాంతి సినిమాల రిలీజ్ లెక్క తేలింది..!
Also Read
తాజగా విడుదలైన మట్కా మొదటి ఆట నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. దాంతో ఆ ప్రభావం కలెక్షన్స్ పై పడింది. ఓవర్సీస్ లో అయితే మట్కా కలెక్షన్స్ మరీ దారుణంగా ఉన్నాయి. వరుణ్ తేజ్ సినిమాకు కనీసం మినిమం ఓపెనింగ్ కూడా రాలేదు అంటే జాగ్రత్తపడాల్సిన టైమ్ వచ్చిందని అర్ధం చేసుకోవాలి. రిలీజ్ రోజు కలెక్షన్స్ కేవలం లక్షల్లో గ్రాస్ వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందొ వరుణ్ తేజ్ చూసుకోవాలి. కెరీర్ మొదట్లో చేసిన ఫిదా, తొలిప్రేమ సూపర్ హిట్స్ మాత్రమే కాకుండా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తెచ్చాయి. ఆ తర్వాత మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తూ చేసిన మిస్టర్, లోఫర్, ఘని, గాండీవదారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్ వేటికవే బీభత్సమైన ప్లాప్స్. మధ్యలో వచ్చిన గద్దల కొండా గణేష్ కాస్త రిలీఫ్ ఇచ్చినా అది రీమేక్ . తాజగా వచ్చిన మట్కా ఫైనల్ రన్ లక్షల్లో ముగిసేలా ఉంది. మెగా ఫ్యామిలీ స్టాంప్ ఉన్నా కూడా ఈ విధమైన కలెక్షన్స్ హీరో కెరీర్ కు అంత మంచిది కాదు. దాదాపు రూ. 50 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా కోటి రాబట్టలేదు అంటే వరుణ్ తేజ్ కు డేంజర్ బెల్స్ మోగినట్టే. ముందు అర్జెంట్ గా డీసెంట్ హిట్ సినిమా ఒకటి పడాలి లేదంటే అంతే సంగతులు.
- Tags
- Matka
- MATKAonNOV14th
- VarunTej
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!