Site icon NTV Telugu

New Born Baby: ఆడపిల్ల పుట్టిందని హెలికాప్టర్ ద్వారా స్వాగతం

New Born Baby

New Born Baby

దేశంలో చాలా మంది ఆడపిల్లలు పుట్టకూడదని కోరుకుంటారు. కానీ కొంతమంది మాత్రం ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని గట్టిగా నమ్ముతారు. ఈ కోవలోకే ఓ ఫ్యామిలీ వస్తుంది. మహారాష్ట్ర షెల్గావ్‌లోని ఓ కుటుంబం అప్పుడే పుట్టిన ఓ ఆడపిల్లను హెలికాప్టర్‌లో ఇంటికి తీసుకువెళ్లి ఘనస్వాగతం పలికింది. హెలికాప్టర్ నుంచి దిగిన తర్వాత పాపకు పూల మాలలు వేసి కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు.

ఆడపిల్ల పుట్టిందని సదరు ఫ్యామిలీ మాములుగా సంబరాలు చేయలేదు. ఈ వేడుకలను చూసేందుకు ఊరంతా తరలివచ్చిందంటే అతిశయోక్తి కాదు. ఈ విషయంపై పాప తండ్రి విశాల్ జరేకర్ స్పందించారు. తమ కుటుంబంలో ఆడపిల్ల లేదని.. అందుకే రూ.లక్ష ఖర్చు పెట్టి తమ గారాలపట్టికి ఇలా ప్రత్యేకంగా హెలికాప్టర్‌లో ఆహ్వానం పలికామని చెప్పాడు. చిన్నారికి రాజ్యలక్ష్మి అనే పేరు పెట్టామని వివరించాడు. జెజురీలోని ఆలయానికి వెళ్లి అక్కడ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని భావించామని.. అయితే అందుకు అనుమతి లేకపోవడంతో ఆకాశం నుంచే దండం పెట్టుకున్నామని విశాల్ జరేకర్ పేర్కొన్నారు. కాగా ఆడపిల్ల పట్ల ఫ్యామిలీ చూపించిన అభిమానానికి గ్రామస్తులంతా మెచ్చుకుంటున్నారు.

 

https://ntvtelugu.com/tamilnadu-former-built-a-temple-for-his-pet-dog/

Exit mobile version