Site icon NTV Telugu

Diamond: ఇసుక‌బ‌ట్టీ ఓన‌ర్… రాత్రికి రాత్రే ఇలా… అదృష్టం అంటే ఇదే…

అదృష్టం ఎప్పుడు ఎవ‌ర్ని ఎలా ప‌ల‌క‌రిస్తుందో ఎవ‌రూ చెప్ప‌లేరు. కొంత‌మంది ఎంత క‌ష్ట‌ప‌డినా చాలీచాల‌ని జీవితాల‌ను గ‌డ‌పాల్సి వ‌స్తుంది. కొంత‌మంది కొద్దిగా క‌ష్ట‌ప‌డితే చాలు కావాల్సినంత సంపాదిస్తుంటారు. మ‌రికొంద‌రు పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఎప్ప‌టికైనా విజ‌యం సాధించ‌క‌పోతామా అనే ధీమాతో క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తుంటారు. ఇలాంటి వారు ఏదో ఒక రోజున త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తారు. ఇలాంటి సంఘ‌ట‌న ఒక‌టి మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ప‌న్నాజిల్లాలో జ‌రిగింది. సుశీల్ శుక్లా అనే వ్య‌క్తి స్థానికంగా ఇటుక బట్టీని నిర్వ‌హిస్తున్నాడు. దీనికి కావాల్సిన మ‌ట్టిని క‌ళ్యాణ్ పూర్ ప్రాంతంనుంచి తీసుకొస్తుంటారు. 20 ఏళ్ల క్రితం క‌ళ్యాణ్ పూర్ ప్రాంతంలో వ‌జ్రాల కోసం గాలించారు.

Read: KIA Cars: అనంత‌పురం ప్లాంట్ నుంచి 5 ల‌క్ష‌ల కార్లు…

ఎంత వెతికినా లాభం లేక‌పోవ‌డంతో ఆ ప‌నిని ప‌క్క‌న పెట్టి ఇటుక బ‌ట్టిని నిర్వ‌హిస్తున్నాడు. ఎప్ప‌టిలాగే మ‌ట్టిని సేక‌రించ‌గా అందులో 26.11 క్యారెట్ల బ‌రువైన ఓ డైమండ్ బ‌య‌ట‌ప‌డింది. దీనిని శుక్లా అధికారుల‌కు అప్ప‌గించారు. ఆ వ‌జ్రాన్ని ప‌రిశీలించిన అధికారులు దాని విలువ సుమారు కోటి వ‌ర‌కు ఉంటుంద‌ని, వేలంలో కోటి 20 ల‌క్ష‌ల వ‌ర‌కు అమ్ముడుపోయే అవ‌కాశం ఉంటుందని, రాయితీలు, ట్యాక్సులు అన్ని పోగా మిగిలిన మొత్తాన్ని శుక్లాకు అధికారులు అప్ప‌గించ‌నున్నారు. 20 ఏళ్ల నాటి క‌ల ఇప్పుడు ఇలా నెర‌వేర‌డంతో శుక్లా కుటుంబం ఆనందం వ్య‌క్తం చేస్తున్న‌ది. త‌న బిజినెస్‌ను పెంచుకోవ‌డానికి ఈ డ‌బ్బు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చెబుతున్నాడు శుక్లా.

Exit mobile version