ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కు పోయాను అనే సాంగ్ గుర్తుంది కదా…అలానే పాపం ఓ చిరుత పులి బద్లాపూర్ జిల్లా గోరెగాన్ ప్రాంతంలోకి వచ్చింది. అడవిలోనుంచి వచ్చిన సంవత్సరం వయసున్న చిరుతపులి వాటర్ క్యాన్‌లో ఏదో ఉందనుకొని తల దూర్చింది. తలైతే దూరిందికానీ ఆ తలను వెనక్కి ఎలా తీయాలో అర్థం కాలేదు. దీంతో పాపం ఆ చిరుత నానా కష్టాలు పడింది. విషయం తెలుసుకున్న స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. 30 మంది కలిసి 48 గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి ఫైనల్‌గా చిరుతను బంధించారు.
Read: Go Fish Tournament: ఇలాంటి టోర్నమెంట్ గురించి ఎప్పుడైనా విన్నారా?
అక్కడి నుంచి దానిని విజయవంతంగా తరలించి తల నుంచి ప్లాస్టిక్ క్యాన్‌ను వేరు చేశారు. వాటర్ క్యాన్‌లో తల ఇరుక్కుపోవడంతో ఏం చేయాలో తెలియక ఎటు పడితే అటు పరుగులు తీసింది. దీంతో చిరుతను పట్టుకోవడం కష్టంగా మారిందని అధికారులు పేర్కొన్నారు. తల క్యాన్‌లో ఇరుక్కుపోవడంతో రెండు రోజులపాటు ఆహరం నీరు లేక చిరుత డీహైడ్రైడ్ అయ్యిందని అధికారులు పేర్కొన్నారు. రెస్క్యూ చేసిన అనంతరం చిరుతకు ఆహారాన్ని అందించి అడవిలో వదిలేసినట్టు అధికారులు పేర్కొన్నారు.
