బ్యూటిఫుల్ హీరోయిన్ అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఒకప్పుడు సౌత్ ఇండియాను అందంతో చక్రం తిప్పింది.. అస్సలు గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చింది.. అయితే ఈ అమ్మడు తెలుగు, తమిళ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది.. కేరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. చెప్పినట్లుగానే గౌతమ్ కిచ్లూతో కరోనా సమయంలో ఏడడుగులు వేసింది.. ఆ తర్వాత ఏడాదికి పైగా సినిమాలకు దూరంగా ఉంది.. ఓ బిడ్డకు తల్లి కూడా అయ్యింది..
కాజల్-గౌతమ్ కిచ్లూ దంపతులు తమ ముద్దుల తనయుడికి నీల్ కిచ్లూ అంటూ నామకరణం కూడా చేశారు. బిడ్డ పుట్టిన నాలుగు నెలలకే కెరీర్ పై ఫోకస్ పెట్టిన కాజల్.. మళ్లీ ఫిట్ గా మారి సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది.. గతంలో అంత జోరుగా అవకాశాలు దక్కకపోయినా కూడా .. సీనియర్ హీరోల సరసన నటించే అవకాశాలను అందుకుంటుంది.. ప్రస్తుతం తెలుగులో కాజల్ అగర్వాల్ బాలకృష్ణ సరసన `భగవంత్ కేసరి` సినిమాలో నటిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కానుంది. అలాగే కోలీవుడ్ లో కమల్ హాసన్ తో `ఇండియన్ 2`లో నటిస్తోంది.. ఈ సినిమా కూడా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది..
ఇది ఇలా ఉండగా.. ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే.. కాజల్ రెండోసారి ప్రెగ్నెంట్ అయిందట. భర్త గౌతమ్ కు పిల్లలంటే చాలా ఇష్టమట. అందుకే నీల్ తర్వాత మరొక బిడ్డను కనాలని కాజల్ భావించిందట. ఇక నీల్ కు ఏడాది నిండటంతో కాజల్ మళ్లీ గర్భం దాల్చిందని నెట్టింట ఓ న్యూస్ వైరల్ గా మారింది.. అలాగే ఇక సినిమాలకు కూడా ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు వార్తలు కూడా మరోవైపు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.. అందుకే ఉన్న సినిమాలను త్వరగా పూర్తి చెయ్యాలనే ఆలోచనలో ఉందట.. కొత్త సినిమాలకు సైన్ కూడా చెయ్యలేదు.. మరి ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..
