Site icon NTV Telugu

Weddings: అవి లేక.. ఒకే నెలలో 32 లక్షల పెళ్లిళ్లు

Wedding

Wedding

Weddings: పెళ్ళికి కావాల్సింది ఏంటి.. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, భజంత్రీలు, బంధువులు, భోజనాలు.. అబ్బే ఇవేమి కాదు.. పెళ్ళికి కావాల్సింది ముహూర్తం. అవును అండీ ముహూర్తం లేనిదే ఒక్క పెళ్లి కూడా జరగదు. అందుకే అంటారు ముహుర్తాలు లేక పెళ్లిళ్లు వాయిదా వేశామని. ప్రస్తుతం ఇండియాలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇప్పుడు కాకపోతే ఇక ముహుర్తాలు దొరకవని పెళ్లి కొడుకులు వెంటనే ముహూర్తం ఖాయం చేసేస్తున్నారట. అసలు విషయం ఏంటంటే.. ఇండియాలో నవంబర్ నుంచి డిసెంబర్ 14 లోపు దాదాపు 32 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయట. యావత్ భారతదేశంలో ఈ ఒక్క నెలలో రోజుకు కొన్ని వేల పెళ్లిళ్లు జరుగుతున్నాయట.

చిన్నా, పెద్ద మండపాలు, గుడులు, రిజిస్టర్ ఆఫీస్ లు అసలు ఖాళీ కూడా ఉండడం లేదట. ఇదంతా సిఏఐటి అనే సంస్థ సర్వేలో తేలింది. ఇక ఈ పెళ్లిళ్లకు అయ్యే ఖర్చు అయితే అక్షరాలా రూ.3.75 లక్షల కోట్లు అని అంచనా.. దిమ్మ తిరిగిపోతుంది కదా. జీవితంలో జరిగే అద్భుతమైన ఘట్టం.. ఎన్నో జ్ఞాపకాలు.. ఎవరి స్తోమతకు మించినట్లు వారు తమ వివాహానికి ఖర్చు పెడుతూ ఉంటారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వార్తపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. పెళ్లి కానీ వారు ఆ జంటలకు కంగ్రాట్స్ చెప్తుంటే.. పెళ్ళై ఫ్రస్టేషన్ లో ఉన్నవారు మాత్రం పెళ్లి కోసం కంగారు ఎందుకు బ్రో.. అంటూ వేదాంతాలు చెప్తున్నారు.

Exit mobile version