Site icon NTV Telugu

వైర‌ల్‌: ఇండియాలో తొలి బ్లాక్ చెయిన్ వివాహం…

సాంకేతిక‌త అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత పెళ్లిళ్లు కూడా టెక్నాల‌జీకి అనుకూలంగా జ‌రుగుతున్నాయి. క‌రోనా స‌మయంలో చాలా వ‌ర‌కు పెళ్లిళ్లు ఆన్‌లైన్ ద్వారా జ‌రిగాయి. స్కూళ్లు, కాలేజీల క్లాసులు చాలా వ‌ర‌కు ఆన్లైన్ ద్వారానే జ‌రిగాయి. అంతా డిజిట‌లైజేష‌న్ అయ్యాక ఇప్పుడు క‌రెన్సీ కూడా ఇప్పుడు డిజిట‌ల్ రూపంలోనే అందుబాటులోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. క్రిఫ్టోక‌రెన్సీ అందుబాటులోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. బ్లాక్ చెయిన్ టెక్నాల‌జీతో క్రిఫ్టోక‌రెన్సీ న‌డుస్తున్న‌ది. కాగా, ఇప్పుడు బ్లాక్ చెయిన్ టెక్నాల‌జీని వినియోగించుకొని వివాహాలు కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ బ్లాక్ చెయిన్ వెడ్డింగ్ హాట్ టాపిక్‌గా మారింది.

Read: కియా నుంచి మ‌రో కొత్త మోడ‌ల్‌… ఈనెల 15 నుంచి…

ఫూణేకు చెందిన అనీల్‌, శృతి నాయ‌ర్ లు బ్లాక్ చెయిన్ ద్వారా వెడ్డింగ్ చేసుకున్నారు. అనిల్‌, శృతి నాయ‌ర్ లు ఇథీరియం స్మార్ట్ కాంట్రాక్ట్‌తో బ్లాక్ చెయిన్ ద్వారా వివాహం చేసుకున్న‌ట్టు వెల్ల‌డించారు. దీనికి గుర్తుగా నాన్ ఫంజ‌బుల్ టోకెన్‌ను ఓపెన్‌సీ ప్లాట్‌ఫామ్‌లో ముద్రించిన‌ట్టు తెలిపారు. ఈ పెళ్లికోసం ఇద్ద‌రూ క్రిఫ్టోక‌రెన్సీ వ్యాలెట్ల‌ను ఉప‌యోగించిన‌ట్లు పేర్కొన్నారు. డేటాను డిజిట‌ల్ లెడ్జ‌ర్‌లో స్టోర్ చేశారు. ఇలా డేటాను స్టోర్ చేయ‌డాన్ని ఎన్ఎఫ్‌టీ లేదా బ్లాక్ చెయిన్ అని కూడా పిలుస్తారు. ఇందులో స్టోర్ చేసిన డేటాను ప‌ర‌స్ప‌రం షేర్ చేసుకోవ‌డానికి కుద‌ర‌దు. ఇది పూర్తిగా సెక్యూర‌బుల్ గా ఉంటుంది.

Exit mobile version