NTV Telugu Site icon

Viral video: చైనాలో భారత ఇన్‌ఫ్లుయెన్సర్ వెకిలిచేష్టలు.. మండిపడుతున్న నెటిజన్లు

Viralvideo

Viralvideo

చైనాలో భారత్ ఇన్‌ఫ్లుయెనర్స్ ప్రవర్తనపై సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ఆమె చర్యను జాత్యహంకారంగా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని హితవు పలుకుతున్నారు. అసలు ఇంతకీ ఏమైంది? ఆమెపై మండిపడడానికి గల కారణమేంటో ఈ వార్త చదవండి.

ఇది కూడా చదవండి: Chiranjeevi: గద్దర్ అవార్డుల పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు.. చిరంజీవి కీలక ట్వీట్

భారత్‌కు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ జస్‌ప్రీత్ కౌర్ ద్యోరా చైనాలో పర్యటించింది. ఈ సందర్భంగా అక్కడ ఉన్న స్థానికులను హిందీలో హేళన చేస్తూ మాట్లాడింది. మీరే ప్రపంచానికి కరోనా అంటించారని.. బదులుగా మేము కూడా గాయం చేస్తామంటూ సంభోదించింది. “జైసే ఆప్ లోగ్ కరోనా దే సక్తే హో వరల్డ్ కో, తో క్యా మే ఆప్కో ట్రామా దే శక్తి హూ?’’ అంటూ హిందీలో వ్యాఖ్యానించింది.

ఇది కూడా చదవండి: Nirmala sitharaman: 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యం..

అంతేకాకుండా ఓ షాపు దగ్గరకు వెళ్లి వధించిన జంతువు రక్తం గురించి మాట్లాడడం.. వంతెన నాణ్యత గురించి ఆరా తీయడం వంటి.. హేయమైన చర్యలకు పాల్పడింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ వీడియో పోస్టు చేసి చాలా రోజులైనా.. తాజాగా వైరల్‌గా మారింది. దీంతో భారతీయులు తీవ్రస్థాయిలో ఆమెపై మండిపడుతున్నారు. జాత్యహంకార చర్యగా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి చర్యలతో ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.