Site icon NTV Telugu

వెరైటీ దోశ‌: ఢిల్లీలో 10 అడుగులు… హైద‌రాబాద్‌లో 6 అడుగులు…

దోశ‌ల్లో ఎన్నో ర‌కాలు ఉంటాయి. అందులో కొన్ని చాలా టేస్టీగా ఉంటే, మ‌రికొన్ని ప‌బ్లిసిటీతో ఆక‌ట్టుకుంటుంటాయి. అలాంటి వాటిల్లో ఢిల్లీలో 10 అడుగుల దోశ ఒక‌టి. అక్క‌డ ఈ దోశ‌కు మంచి డిమాండ్ కూడా ఉన్న‌ది. వీకెండ్స్‌లో ఫ్యామీలీలో ఈ దోశ‌ను తినేందుకు ఎక్కువ‌గా ఢిల్లీలోని రెస్టారెంట్ కు వెళ్తుంటారు. సింగిల్‌గా 10 అడుగుల దోశ‌ను తిన్న‌వారికి 71 వేల రూపాయ‌ల ప్రైజ్ మ‌నీగా ఇస్తామ‌ని ఇటీవ‌లే రెస్టారెంట్ యాజ‌మాన్యం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇక ఢిల్లీలో మాదిరిగానే హైద‌రాబాద్‌లోనూ 6 అడుగుల దోశ ఫేమ‌స్ అయింది. ఈ దోశ ను తినేందుకు ఎక్కువ‌మంది ఫ్యామిలీతో వ‌స్తుంటార‌ట‌. వెజ్‌తో పాటు నాన్‌వెజ్ తో చేసిన క‌ర్రీలు కూడా ఈ దోశ‌ల్లో ఇస్తార‌ట‌. హైద‌రాబాద్ 6 ఫీట్ దోశ ఇప్పుడు వైర‌ల్ అవుతున్న‌ది.

Read: ఓవ‌ర్‌లోడ్‌పై ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్‌… రూర‌ల్ ఇండియాపై ప్ర‌త్యేక దృష్టి…

Exit mobile version