NTV Telugu Site icon

Viral News: గుర్రమెక్కిన వరుడు.. మంచమెక్కిన గుర్రం

Groom On Horse

Groom On Horse

కావాలనే వైరల్ అవ్వాలనో లేక పెళ్ళి వేడుకలో ఏదైనా ఒక మూవ్‌మెంట్ కలకాలం గుర్తుండిపోవాలనో తెలీదు కానీ.. ఈమధ్య కాలంలో పెళ్ళిళ్ళలో వినూత్నమైన పనులకు పాల్పడుతున్నారు జనాలు. ఈమధ్యే ఓ వరుడు గజమాల తొడుగుతున్నప్పుడు, అతడి ప్యాంట్ జారిపోవడంతో అందరి ముందు పరువు పోయింది. మరికొన్ని వ్యవహారాల్లో స్వీట్స్ తినలేదని వధువరులు కొట్టేసుకోవడాన్ని చూశాం. ఇప్పుడు లేటెస్ట్‌గా మరో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. పెళ్ళికొడుక్కి సర్‌ప్రైజ్ ఇద్దామని వధువు తరఫు బంధువులు ఓ విచిత్రమైన పనికి పాల్పడ్డారు.

ఆ వివరాల్లోకి వెళ్తే.. వరుడు అందంగా ముస్తాబై గుర్రం ఎక్కాడు. ఊరేగింపుగా వేదిక దగ్గరకు తీసుకొచ్చారు. ఇంకేముంది, దిగిపోదాం అని ఆ వరుడు అనుకుంటుండగా, వద్దు అంటూ అలాగే కూర్చోబెట్టారు. సంప్రదాయం ప్రకారం ఏదైనా కార్యం చేస్తారేమోనని ఆ వరుడు అనుకున్నాడు. కానీ, అతనికి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ముందుగా వరుడు తరఫు బంధువులు మంచం తెప్పించారు. బహుశా అందులో కూర్చోవాలేమోనని ఆలోచిస్తుండగానే.. అనూహ్యంగా వాళ్ళు గుర్రాన్ని ఆ మంచం ఎక్కించారు. అంతటితో ఆగకుండా.. ఆ మంచాన్ని పైకెత్తి గిరగిరా తిప్పేశారు. ఈ దెబ్బతో వరుడు బిత్తరచూపులు చూస్తూ ఉండిపోయాడు. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.