Site icon NTV Telugu

వైర‌ల్‌: ఆమె ధైర్యానికి సోష‌ల్ మీడియా ఫిదా… కోబ్రాను ఇలా ప‌ట్టుకొని…

మ‌హిళ‌లు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. పురుషుల‌తో స‌మానంగా వారితో క‌లిసి వారు చేసే ప‌నుల‌ను మ‌హిళ‌లు సైతం చేస్తూ శ‌భాష్ అనిపించుకుంటున్నారు. సాధార‌ణంగా ఉద్యోగాలు అన్నింటిలోకి కష్ట‌మైన ఉద్యోగం స్నేక్ క్యాచింగ్‌. ఇందులో ఏ మాత్రం అజాగ్ర‌త్త‌గా ఉన్నా ప్రాణాలు పోతాయి. అయితే, కొంత‌మంది ఇలాంటి రిస్క్ ఉద్యోగాల‌ను కూడా చాలా ఇష్టంగా చేస్తుంటారు. విజయాలు సాధిస్తుంటారు. ఇలాంటి వారిలో రోహిణి కూడా ఒక‌రు.

Read: క‌రుగుతున్న గ్రీన్‌లాండ్‌… ఇలానే కొన‌సాగితే ప్ర‌పంచం…

కేర‌ళ‌కు చెందిన రోహిణి అట‌వీశాఖ‌లో ఉద్యోగిణిగా ప‌నిచేస్తున్న‌ది. ఉద్యోగంతో పాటు రోహిణి స్నేక్ క్యాచింగ్‌లో శిక్ష‌ణ పొందింది. తాను నివ‌శించే చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో పాములు క‌నిపిస్తే వాటిని ప‌ట్టుకొని అడ‌విలో విదిలేస్తుంటుంది. క‌ట్ట‌క్క‌డ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి విష‌స‌ర్పం కోబ్రా రావ‌డం గ‌మ‌నించిన ప్ర‌జ‌లు వెంట‌నే రోహిణీకి స‌మాచారం అందించారు. స‌మాచారం అందుకున్న రోహిణీ రిస్క్యూ హుక్‌, ఓ చిన్న బ్యాగ్ స‌హాయంతో కోబ్రాను ప‌ట్టుకున్న‌ది. దీనికి సంబంధించిన వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ అధికారిణి సుధా రామ‌న్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈవీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Exit mobile version