NTV Telugu Site icon

అద్భుతం: 20 వేల సంవ‌త్స‌రాల‌నాటి మ‌మ్మీ క‌డుపులో…

ఈజిప్ట్ అన‌గానే మ‌న‌కు పెద్ద పెద్ద పిర‌మిడ్‌లు, మ‌మ్మీలు గుర్తుకు వ‌స్తాయి. పిర‌మిడ్‌ల నుంచి ఎన్నో మ‌మ్మీల‌ను బ‌య‌ట‌కు తీసి శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న‌లు చేశారు. అయితే, ఇటీవ‌లే మ‌మ్మ‌ఫికేష‌న్ స‌హాయంతో సుమారు 20 వేల ఏళ్ల‌నాటి మ‌మ్మీక‌డుపులో భ‌ద్రంగా ఉన్న పిండాన్ని శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. వార్సా విశ్వ‌విద్యాల‌యంకు చెందిన ప‌రిశోధ‌కులు సీటీ ఎక్స్ రే స‌హాయంతో మ‌మ్మీ క‌డుపులోని పిండం అవ‌శేషాల ఉనికిని గుర్తించారు. చ‌నిపోయిన మ‌హిళ ప్ర‌స‌వం స‌మయంలో చ‌నిపోలేద‌ని శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. మ‌హిళ చ‌నిపోవ‌డానికి కార‌ణాలు ఏంటి అనేదానిపై ప‌రిశోధిస్తున్నారు. మ‌హిళ చ‌నిపోయే స‌మ‌యానికి గ‌ర్భం 26 నుంచి 30 వారాల పిండంగా ఉంద‌ని, అయితే, మ‌మ్మీకి ర‌సాయ‌నాలు పూసి ఉంచ‌డం వ‌ల‌న పిండంలోని ఎముక‌లు నిర్వీర్యం అయిపోయాయ‌ని, పిండంపై ఉన్న మృదు క‌ణ‌జాలంతో పిండం ఆకృతిని గుర్తించ‌డం క‌ష్టం అవుతుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.

Read: ఇండియా క‌రోనా అప్టేడ్‌: ఈరోజు కేసులు ఎన్నంటే…