Site icon NTV Telugu

Shark Fight: షార్క్‌తో మ‌హిళ భీక‌ర పోరాటం… చివ‌ర‌కు…

మ‌న‌దేశంలో షార్క్ చేప‌లు స‌ముద్ర‌తీర ప్రాంతాల్లో పెద్ద‌గా క‌నిపించ‌వు. కానీ విదేశాల్లో మాత్రం స‌ముద్ర తీర ప్రాంతాల‌ను షార్క్‌లు భ‌య‌పెడుతుంటాయి. స‌ముద్రంలోకి దిగిన వ్య‌క్తులు ఏమాత్రం అజాగ్ర‌త్త‌గా ఉన్నా ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుంది. ఇలానే హీద‌ర్ వెస్ట్ అనే మ‌హిళ ఫ్లోరిడాలోని స‌ముద్రంలో ఈత‌కొట్టేందుకు దిగింది. అలా దిగి ఈత కొడుతున్న స‌మ‌యంలో అనుకోకుండా ఆమె కాలిని ఏదో గ‌ట్టిగా ప‌ట్టుకున్న‌ట్టు గుర్తించింది. షార్క్ అని గుర్తించిన మ‌హిళ వెంట‌నే కాలితో బ‌లంగా త‌న్న‌డం ప్రారంభించింది. దాదాపు 30 సెకన్ల‌పాటు షార్క్‌తో మ‌హిళ పోరాటం చేసింది. మ‌హిళ బ‌ల‌మైన కాలిదెబ్బ‌ల‌కు తాళ‌లేక షార్క్ ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయింది. గాలి గాయంతోనే హీద‌ర్ వెస్ట్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది.

Read: Viral: హెలికాఫ్ట‌ర్‌గా మారిన టాటా నానో…

Exit mobile version