చీర కోసం ఓ మహిళ చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. హర్యానాలోని ఫరీదాబాద్‌లోని ఓ బిల్డింగ్ 9వ అంతస్తులో ఉండే ఓ మహిళ తన చీరను బాల్కానీలో ఆరేసింది. అయితే, ఆ చీర గాలికి ఎగిరి ఎనిమిదో అంతస్తులో పడింది. కింది అంతస్తులో చీర పడిపోవడాన్ని గమనించిన సదరు మహిళ తన కుమారుడిని 9 అంతస్తు బాల్కాని నుంచి ఎనిమిదో అంతస్తులోకి దించింది. దీనికోసం ఆమె దుప్పటిని తాడులా ఉపయోగించింది. కింది అంతస్తులోకి దిగిన ఆ చిన్నారి చీరను తీసుకున్నాడు. ఆ తరువాత మహిళ దుప్పిటిని పైకి లాగింది. ఎదైనా చిన్న తేడా వచ్చి ఉంటే ఆ చిన్నారి ఎనిమిది అంతస్తుల నుంచి కిందపడిపోయేవాడు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. వందల రూపాయల చీర కోసం చిన్నారి ప్రాణాలను పణంగా పెట్టడం బాగోలేదని, బాల్కానీలోనుంచి దిగే బదులుగా, కింది అంతస్తుకు వెళ్లి చీరను తెచ్చుకోవచ్చు కదా అని నెటిజన్లు చురకలు అంటించారు.
Read: Covid Effect: బస్సులను ఇలా అమ్మేస్తున్నారు…
