మహాకుంభమేళాకు సంబంధించి చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఓ కొత్త వీడియో ఈ జాబితాలోకి చేరింది. షేక్ వేషదారణలో ఓ యువకుడు కుంభమేళాకు హాజరయ్యాడు. అక్కడ రీల్స్ చేయడం ప్రారంభించాడు. అక్కడ కొంత సేపు హల్ చల్ సృష్టించాడు. తరువాత జరిగే పరిణామాలను ఊహించలేకపోయాడు. అక్కడికి వచ్చిన కొందరు సాధువులు అతన్ని పట్టుకుని చితకబాదాలు..
READ MORE: Gaza Ceasefire:15 నెలల యుద్ధానికి తెర.. ఇజ్రాయిల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ప్రారంభం..
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో ఓ యువకుడు అరబ్ షేక్ వేషంలో కుంభమేళాకు వచ్చాడు. అతనితో పాటు మరో ఇద్దరు యువకులు ఉన్నారు. ఆ ఇద్దరు ఈ వ్యాక్తికి బాడీగార్డుల్లాగా నటిస్తున్నారు. మరో యువకుడు ఇదంతా వీడియో తీస్తూ.. ఎలా అనిపిస్తుంది అని అడిగాడు. యువకుడు అంతా బాగానే ఉందని చెప్పాడు. పేరు ఏమిటి అని అడిగారు. అప్పుడు అతనితో పాటు నడుస్తున్న మరో ఇద్దరు యువకులు “షేక్ ప్రేమానంద్” అని సమాధానం ఇచ్చారు.
READ MORE: Saif Ali Khan: సైఫ్‌పై దాడి “అంతర్జాతీయ కుట్ర” అనుమానం.. 5 రోజుల కస్టడీ విధించిన కోర్ట్….
రాజస్థాన్ నుంచి వచ్చినట్లు తెలిపారు. దీంతో అక్కడున్న సాధువులతో పాటు మరికొందరు స్థానికులు వారిని చుట్టుముట్టినట్లు కనిపిస్తోంది. షేక్ తలపాగాను తొలగించారు. అదే సమయంలో ఓ సన్యాసి యువకుడి కాలర్ పట్టుకుని ఉన్నాడు. అందరూ కలిసి యువకుడిని చితక బాదారు. చివరికీ ఆ యువకుడు నకిలీషేక్ అని తేలింది.
दूसरी वीडियो शेख की 🤣 pic.twitter.com/KbVrR71Fu5
— Champaran wala (@champaranwala) January 18, 2025