Site icon NTV Telugu

Viral Video: పులితో బాతు దాగుడు మూతలాట

Duck Tiger

Duck Tiger

పులి కనిపిస్తే చాలు చాలా వరకు పక్షలు, జంతువులు దాని సమీపంలో ఉండేందుకు ప్రయత్నించవు. కానీ దానికి భిన్నంగా ఓ బాతు మాత్రం పులిలో దాగుడుమూతలు ఆడింది. ఆకలితో ఉన్న పులి బాతుపై అటాక్ చేయడానికి రావడంతో వెంటనే నీటిలో మునిగిపోతూ పులికి మస్కా ఇచ్చింది. ఓ కొలనులో ఉన్న పులి నేర్పుతో, ఓపికగా, నిదానంగా బాతుపై అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. వెంటనే బాతు నీటిలో మునిగిపోతుంది. దీంతో పులి అయోమయానికి గురై అటూ ఇటూ చూసుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అయింది.

దాదాపు 10 సెకన్లు ఉన్న ఈ వీడియోను 2.5 మిలియన్ కన్నా ఎక్కువ వ్యూస్ దక్కించుకుంది. ‘ బాతులు సాధారణంగా పులుల కన్నా తెలివైనవిగా అనిపిస్తున్నాయి’ అని ఓ నెటిజెన్ కామెంట్ చేయగా.. ‘ బాతు చాలా నమ్మకంగా ఉంది, అది ఎగిరిపోవడానికి కూడా ప్రయత్నించలేదు’ అని మరో నెటిజెన్ కామెంట్ చేశారు. ఇదిలా ఉంటే కొంతమంది మాత్రం జూల్లో బాతుల రెక్కలను కత్తిరించి ఇలా సందర్శకులకు ఆనందం పంచుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది చైనా జూల్లో ఇలాగే మూడు పులులను బాతులు ఆటపట్టించే వీడియోలను షేర్ చేశారు.

https://twitter.com/buitengebieden/status/1534265466725736448

Exit mobile version