NTV Telugu Site icon

Viral Video: ముందు ముద్దుగుమ్మ.. వెనకాల తాగుబోతు.. చిందులే చిందులు..!!

Viral Dance

Viral Dance

Viral Video: సోషల్ మీడియా ద్వారా క్రేజ్ సంపాదించడం ఇప్పుడు మాములు విషయంగా మారిపోయింది. కాస్త ఎంటర్‌టైనింగ్‌గా ఉండే వీడియో పోస్ట్ చేస్తే క్షణాల్లోనే వైరల్ అయిపోతోంది. దీంతో పలువురు వ్యక్తులు గంటల వ్యవధిలోనే ఫేమస్ అయిపోతున్నారు. దీని కోసం ఎలాంటి హోదాలు అవసరం లేదు. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రోడ్డుపై ఓ అమ్మాయి తనకు నచ్చిన ‘దిల్ బర్.. దిల్ బర్’ అనే పాటకు డ్యాన్స్ చేస్తుండగా ఆమె వెనకాల ఖాకీరంగు డ్రెస్ వేసుకున్న ఓ తాగుబోతు కూడా వచ్చి డ్యాన్స్ చేశాడు. విచిత్రం ఏంటంటే.. అందంగా ఉన్న అమ్మాయి డ్యాన్స్ కంటే.. తాగుబోతు డ్యాన్స్ అందరినీ ఆకట్టుకోవడం విశేషం అనే చెప్పాలి.

చిల్డ్ యోగి పేరుతో ఉన్న ట్విట్టర్‌లో ఈ వీడియో పోస్ట్ చేసిన కాసేపటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోకు 2.62 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అటు వేల సంఖ్యలో లైకులు, రీ ట్వీట్‌లు కూడా వచ్చి చేరుతున్నాయి. ఈ వీడియోలో యువతిని పెద్దాయన అనుకరించడం పలువురిని ఆకర్షిస్తోంది. కొంతమంది అమ్మాయి డ్యాన్స్ బాగుందని మెచ్చుకుంటుంటే.. మరికొందరు అమ్మాయి వెనకాల తాగుబోతు చేసే డ్యాన్స్ కిరాక్ ఎక్కిస్తోందంటూ నెటిజన్‌లు కామెంట్ చేస్తున్నారు. కొందరు మాత్రం నడిరోడ్డుపై అమ్మాయి ఇలా డ్యాన్స్ చేయడం నచ్చలేదని విమర్శలు కూడా చేస్తున్నారు. యువతి కంటే పెద్దాయన చేసిన డ్యాన్స్ తనను ఇంప్రెస్ చేసిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ వీడియోను చిన్నా, పెద్ద అందరూ వీక్షిస్తున్నారు.