NTV Telugu Site icon

క‌రోనాకు వ‌యాగ్రా ఔష‌దం: కోమా నుంచి కోలుకున్న మ‌హిళ‌…

క‌రోనా మ‌హామ్మారి ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న‌ది.  సామాన్యుల‌తో పాటు వైద్యులు, వైద్య‌సిబ్బందికి, న‌ర్సుల‌కు క‌రోనా సోకుతున్న‌ది.  ఇక యూకే సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.  యూకేలో ప్ర‌తిరోజు భారీ సంఖ్య‌లో క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి.  భారీగా కేసులు న‌మోద‌వుతున్నా ల‌క్ష‌ణాలు త‌క్కువ స్థాయిలో ఉండ‌టం కొంత ఊర‌ట‌నిచ్చే అంశం.  అయితే, యూకేలోని లింకన్‌షైర్‌కు చెందిన మోనికా అనే మ‌హిళా న‌ర్సుకు న‌వంబ‌ర్ 9 వ తేదీన క‌రోనా సోకింది.  క‌రోనా బారిన ప‌డ్డ అ న‌ర్స్‌ను ఆసుప‌త్రిలో చేర్చారు.  ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆ నర్స్ కోమాలోకి వెళ్లింది.  25 రోజుల‌పాటు కోమాలో ఉంది.  కోమాలో ఉన్న‌ప్పుడు న‌ర్స్‌కు వ‌యాగ్రా ఔష‌దం అందించారు.  

Read: షాక్‌: ఆ పెద్దాయ‌న 11 సార్లు వ్యాక్సిన్ తీసుకున్నాడ‌ట‌…

రోజుకు కొంత మోతాదులో వ‌యాగ్ర ఔష‌దాన్ని అందించ‌డంతో కోమా నుంచి కోలుకున్న‌ది.  వ‌యాగ్రా ఔష‌దాన్ని ఇవ్వ‌డంతో ధ‌మ‌ని వ్య‌వ‌స్థ‌లో ఉద్వేగం క‌లిగి ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ వేగంగా జ‌రిగింది.  దీంతో మోనికా కోమా నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది.  కోమానుంచి పూర్తిగా కోలుకున్న త‌రువాత ఇటీవ‌లే డిశ్చార్జ్ అయింది.  వైద్య చ‌రిత్ర‌లో ఇది మిరాకిల్‌గా చెప్పుకోవాలి.  అయితే, అన్ని కేసుల్లో వ‌యాగ్రాను ఇవ్వ‌డం సాధ్యం కాద‌ని, వ‌యాగ్రా డోసులు ఇవ్వ‌డం వ‌ల‌న ర‌క్తంలో ఆక్సీజ‌న్ శాతం ఏంత మేర పెరుగుతుందో ఖ‌చ్చింతంగా అంచ‌నా వేయ‌గ‌ల‌గాల‌ని అప్పుడే రోగి బ‌త‌క‌గ‌లుగుతారని వైద్యులు చెబుతున్నారు.