Site icon NTV Telugu

Viral Video: ఈ కుక్క చేసే విన్యాసాలు చూస్తే ఎవరికైనా దిమ్మ తిరిగాల్సిందే..!

Dog

Dog

కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అంటారు పెద్దలు.. సాధన ఉండాలే కానీ ఏదైనా సాధించవచ్చు అని నిరూపించింది ఈ శునకం. అంతగా ఈ కుక్క ఏమి చేసింది అనేగా అందరి డౌట్.. చెప్తాం వినండి. కొన్ని జంతువులు చేసే పనులు చూస్తే ఎవ్వరికైనా మతి పోతుంది. మనుషులు కూడా చేయలేని పనులను కొన్నిసార్లు జంతువులు చేసి చూపిస్తాయి. తాజాగా ఈ వీడియో లో ఉనన్ సుంకం కూడా ఒక సాహసోపేతమైన విన్యాసం చేసింది. మనుషులు తలపై నీళ్ల గ్లాసును పెట్టుకొని నడవడం ఈజీ.. అదే కుక్క చేయాలి అంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని.. కానీ ఆ విన్యాసాన్ని ఈ కుక్క అవలీలగా చేసేసింది.

తలపై నీళ్ల గ్లాస్ పెట్టుకొని క్యాట్ వాక్ చేసుకుంటు నడిచింది. గ్లాస్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ కుక్క ఎంతో నేర్పుతో నడిచింది. ఆ గ్లాస్ లో నుంచి ఒక చుక్క నీరు కూడా కిందపడకుండా నడవడం ఆశ్చర్యం.. ఇక ఈ వీడియో చూసిన శునకప్రియులు వావ్ ఎంత బాగా చేసింది అంటూ పొగిడేస్తుండగా.. మిగతా వారు ఔరా శునకమా అంటూ ప్రశంసిస్తున్నారు. ఇక ఈ వీడియో పై నెటిజన్స్ తమదైన రీతిలో స్పదింస్తున్నారు. ఈ కుక్కను ఒలంపిక్స్ కు పంపించాలి అని కొందరు.. కుక్క చేత బాగా ప్రాక్టీసు చేయించి ఉంటారు యజమానులు అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ కుక్క ఎవరిది..? ఏంటి..? అనే వివరాలు తెలియవు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version