Site icon NTV Telugu

Puffed rice: యాక్‌.. తూ… మరమరాలు ఇలా తయారు చేస్తారా?

Puffed Rice

Puffed Rice

Puffed rice: బొరుగులు, పేలాలు ఇలా రకరకాల పేర్లతో పిలుచుకునే మరమరాలను చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. వీటితో రకరకాల స్వీట్లు, స్నాక్స్ కూడా తయారుచేస్తారు. వీటిని టీలో కూడా వేసుకుని కొంతమంది తింటూ టీ తాగుతూ ఆస్వాదిస్తుంటారు. అయితే అపరిశుభ్ర వాతావరణంలో ఈ ఆహార పదార్థాలు ఎంత అపరిశుభ్రంగా తయారవుతున్నాయో తెలిస్తే.. యాక్‌ ఛీ.. తూ ఏంటి మర మరాలు ఇలా తయారు చేస్తారా? అనే డైలమాలో పడిపోవడం ఏమోకానీ.. మీరు తినే మరమరాలు ఇవేనా? అనే ప్రశ్నలు మైండ్‌ లో వస్తాయి. అవి ఎలా తయారు చేస్తారో మీకు తియాలంటే దానికి సంబంధించిన ఒక వీడియో ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో బయటకు రావడంతో ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. ఒక ప్రముఖ ఫుడ్ బ్లాగర్ అమర్ సిరోహి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో ప్రజలను షాక్‌కు గురి చేసింది.

ఈ వీడియోలో మరమరాలు (పఫ్డ్ రైస్) ఎలా తయారు చేస్తారో స్పష్టంగా కనిపించింది. అయితే.. వీరు మరమరాలు తయారు చేసేందుకు చేస్తున్న ఈ ప్రక్రియ చాలా అపరిశుభ్రంగా ఉంది. ఈ వీడియోలో, ఒక కార్మికుడు తన కాళ్ళతో బియ్యాన్ని తొక్కడం, కడుగుతూ కనిపించాడు. కాళ్లతో రాళ్ళ ఉప్పును దానిపై వేసి కలుపుతూ కనిపించాడు. కాళ్లతోనే అంతా కడిగి అపరిశుభ్రమైన నీళ్లలో ఓ మూటలోని మరమరాలు తయారు చేస్తున్న బియ్యాన్ని కడగడం అందరికి షాక్‌ గురయ్యేలా చేశాయి. ఏంటీ మేము తినేది ఇలా తయరు చేసే మరమరాలా? అంటూ దేవుడా ఏంటీ ఘోరం అంటున్నారు. ఈ ప్రక్రియ పరిశుభ్రతపై ప్రజలు అసహ్యం, ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది వినియోగదారులు అపరిశుభ్రమైన ప్రక్రియ ఉన్నప్పటికీ మర్మరాలను తినడం గురించి వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. మరికొందరు ప్రక్రియను ఆరోగ్యవంతంగా చేయడానికి యంత్రాలను మరియు మెరుగైన పద్ధతులను ఉపయోగించాలని సూచించారు. “అందుకే భారతదేశాన్ని మురికి దేశంగా చూస్తారు” అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. ఈ వీడియో చూసి ఎవరైనా మరమరాలు తినే ధైర్యం చేస్తారా? అని కొందరు ప్రశ్నించారు. అతి మురికి వాతావరణంలో వీటిని తయారు చేయడం మంచిది కాదని అంటున్నారు.

ఈ వైరల్ వీడియోని మీరు కూడా చూసేయండి…!


Rakul Preet Sing: రెడ్‌ బికినీలో రచ్చ చేస్తున్న రకుల్‌

Exit mobile version