NTV Telugu Site icon

Uttarpradesh:ఉచితంగా చికెన్ ఇవ్వలేదని.. దళితుడిపై దాడి!

Dalit

Dalit

దళితులపై దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఇటువంటి దారుణాలకు అడ్డూ ఆపూ లేకుండా పోతోంది. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇటువంటి వారిలో మార్పు రావడం లేదు. తాజాగా ఉచితంగా చికెన్ ఇవ్వనందుకు ఒక దళితుడిపై కొందరు దుండగులు విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉత్తర్ ప్రదేశ్ లోని లలిత్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

Also Read: Elon Musk: కొడుకుతో మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్.. ఫోటో షేర్ చేసిన మస్క్

వివరాల ప్రకారం సుజన్ అహిర్వార్‌‌ అనే దళితుడు బైక్ పై తిరుగుతూ గ్రామాల్లో చికెన్ అమ్ముతూ ఉంటాడు. దాడి జరిగిన రోజు కూడా అహిర్వార్ చికెన్ అమ్ముతూ వెళుతూ ఉండగా మద్యం మత్తులో ఉన్న నిందితులు అతడిని ఆపారు. చికెన్ ఇవ్వాలని అడిగారు. అహిర్వార్ డబ్బులు అడగగా ఆవేశంతో రెచ్చిపోయిన దుండగులు అహిర్వార్ పై చెప్పులతో దాడి చేశారు. వదిలేయాలని వేడుకుంటున్నా కనికరం లేకుండా చావబాదారు. అయితే ఈ ఘటన జరుగుతున్నప్పుడు ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. అది పోలీసుల కంటపడటంతో నిందుతులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.