Site icon NTV Telugu

Currency Notes: నదిలో 2వేల నోట్ల కట్టలు.. తర్వాత ఏమైంది?

Notes

Notes

అప్పుడప్పుడు రోడ్లపై కరెన్సీ నోట్లు పడిపోవడం మనం చూశాం. కానీ నదిలోంచి కరెన్సీ కట్టలు కొట్టుకువస్తే ఎలా వుంటుంది. అలాంటి అనుభవమే ఎదురైంది రాజస్థాన్​ అజ్మేర్​లోని పోలీసులకు. ఆనాసాగర్ సరస్సులో 2వేల రూపాయల కరెన్సీ నోట్ట కట్టలు తేలియాడుతూ రావడంతో పోలీసులు షాకయ్యారు. ఈ నోట్లు కూడా పాలిథీన్ బ్యాగులో ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ సంచిలో మొత్తం 30 నుంచి 32 నోట్ల కట్టలు ఉన్నాయని, అన్నీ రూ.2వేల నోట్లే అని అధికారులు తెలిపారు.

పుష్కర్​ రోడ్డులోని ఈ సరస్సులో భారీగా కరెన్సీ నోట్లు ఉన్నాయని పోలీసులకు ఎవరో సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వాటిని చూసి అవి నకిలీవో, అసలువో అర్థం కాక తలలు పట్టుకున్నారు. ఆ నోట్లను చూస్తే మాత్రం నిజమయినవిగానే వున్నాయి. నీటిలో తడిచిన వాటిని ఆరబెట్టాక నిపుణుల సాయంతో నోట్ల అసలువో, కాదో తెలుసుకుంటామన్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ నోట్ల కట్టలను పాలిథీన్​ బ్యాగులో పెట్టి సరస్సులో విసిరేసి వుంటారని భావిస్తున్నారు.
Vidadala Rajini: రాబోయే ఎన్నికల్లో విశాఖలో వైసీపీ జెండా ఎగరేస్తాం

Exit mobile version