అప్పుడప్పుడు రోడ్లపై కరెన్సీ నోట్లు పడిపోవడం మనం చూశాం. కానీ నదిలోంచి కరెన్సీ కట్టలు కొట్టుకువస్తే ఎలా వుంటుంది. అలాంటి అనుభవమే ఎదురైంది రాజస్థాన్ అజ్మేర్లోని పోలీసులకు. ఆనాసాగర్ సరస్సులో 2వేల రూపాయల కరెన్సీ నోట్ట కట్టలు తేలియాడుతూ రావడంతో పోలీసులు షాకయ్యారు. ఈ నోట్లు కూడా పాలిథీన్ బ్యాగులో ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ సంచిలో మొత్తం 30 నుంచి 32 నోట్ల కట్టలు ఉన్నాయని, అన్నీ రూ.2వేల నోట్లే అని అధికారులు తెలిపారు.…