జూలో ఉండాల్సిన జంతువులు రోడ్డుమీదకు వస్తే ఎలా ఉంటుంది. ఆ జంతువు ఏమీ చేయకపోయినా, దాని ఆకారం, దాని స్వభావంతో ప్రజలు భయపడి పరుగులు తీస్తారు. అమెరికా వంటి దేశాల్లో జూలో ఉండే మొసళ్లు వంటివి అప్పుడప్పుడూ రోడ్డు మీదకు వస్తుంటాయి. వాటిని చూసి ప్రజలు పెద్దగా ఆశ్చర్యపడకపోయినా వాటి నుంచి జాగ్రత్తగా తమను తాము రక్షించుకుంటూ ఉంటారు. అయితే, ఓ జూ నుంచి వ్యాన్‌లో మరో చోటకి మొసలిని తరలిస్తుండగా హఠాత్తుగా అ మొసలి వ్యాన్ నుంచి బయటకు దూకేసింది. వెంటనే అలర్ట్ అయిన జూ మహిళా సిబ్బంది ముగ్గురు మొసలి మూతికి తాడువేసి గట్టిగా బంధించారు. ముగ్గురు మహిళలు చేసిన సాహసానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. దీనికి సంబంధించిన చిన్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.
Read: Viral: కాలుజారి కిందపడ్డాడు… సమయస్పూర్తితో ప్రాణాలతో బయటపడ్డాడు…
