Site icon NTV Telugu

Contract Wedding: వైరల్‌గా మారిన కాంట్రాక్ట్‌ వెడ్డింగ్‌.. దిమ్మతిరిగే షరతులు..!

Contract Wedding

Contract Wedding

కొత్తొక వింత.. పాతొక రోత.. అన్నట్టుగా.. నేటి యువత కొత్తగా ఆలోచించి వార్తల్లో నిలిస్తున్నారు.. ముఖ్యంగా పెళ్లిలాంటి తంతులో ఒక్కొక్కరి ఆలోచన ఒక్కోరకంగా ఉంది.. ఇప్పటి వరకు పెద్దలు కుదిర్చిపెళ్లి, ప్రేమ పెళ్లి, రిజిస్ట్రేషన్‌ మ్యారేజ్‌, గుడిలో పెళ్లి లాంటివే చూశాం.. ఇప్పుడు ఓ కాంట్రాక్ట్‌ వెడ్డింగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. వారి వివాహ వేడుక తర్వాత జంట ఒప్పందంపై సంతకం చేశారు వధూవరులు.. ఇక, ఆ జాబితాలో ఏముందో చూస్తే షాక్‌ తినాల్సిందే.. ఎందుకంటే.. ఒప్పందం ప్రకారం, వధువు ప్రతిరోజూ చీర ధరించాలి, అర్థరాత్రి పార్టీలు జీవిత భాగస్వామితో మాత్రమే వెళ్లాలి లాంటి షరతులు ఇప్పటిక నయా కపుల్స్‌కు పాటించడమే కష్టమే కదా? మరి..

Read Also: Internet: ఆ రాష్ట్రంలో సొంత ఇంటర్నెట్.. ఇండియాలో మొదటి రాష్ట్రంగా గుర్తింపు

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాజాగా జరిగిన ఓపెళ్లి, ఆ సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందం ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.. అసోంకు చెందిన శాంతి మరియు మింటు.. పెళ్లి చేసుకున్నారు.. పెళ్లి తర్వాత ఏం చేయాలి మరియు ఏం చేయకూడదో ఓ జాబితా తయారు చేశారు.. దానిపై ఇద్దరూ సంతకం చేశారు.. వెడ్‌లాక్ ఫోటోగ్రఫీ అసోం ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసిన దీనికి సంబంధించిన క్లిప్‌.. వైరల్‌ అవుతోంది.. తాము చేసుకున్న ఒప్పందాన్ని పెద్ద కాగితంపై ముద్రించారు.. దానిపై సంతకం చేసింది ఆ కొత్త జంట.. ఒప్పందం ప్రకారం, వధువు ప్రతిరోజూ చీరను ధరించాలి, అర్థరాత్రి పార్టీలు జీవిత భాగస్వామితో మాత్రమే వెళ్లాలి, ఆదివారం ఉదయం అల్పాహారం తుమ్ బానోగే అని కూడా రాసుకున్నారు.. నెలకు ఒకసారి పిజ్జా తినాలి, ఇంట్లో వంటనే మనం తినాలి.. అయితే, ఎవరు వంట చేయాలనే విషయాన్ని ప్రస్తావించలేదు, ఇద్దరం ప్రతిరోజూ జిమ్‌కి వెళ్లాలి, పార్టీలో మంచి మంచి ఫొటోస్ దిగాలి, ప్రతి 15 రోజుల తర్వాత షాపింగ్ చేయాలి వంటివి చేర్చారు..

అయితే, ఈ వివాహ ఒప్పందాన్ని చూసి కొందరు ఆశ్చర్యపోతున్నారు.. మరికొందరు విసుగు చెందుతున్నారు.. ఆ ఫొటోలు, వీడియోలు షేర్‌ చూస్తూనే.. రకరకాల కామెంట్లు పెడుతున్నారు.. భాయ్, ఇది వివాహం కాదు ఇది ఒప్పందం అని ఓ నెటిజన్‌ కామెంట్‌ పెడితే.. అన్ని షరతులు సరే.. కానీ, రోజువారీ చీర చాలా ఎక్కువ అని మరొకరు.. భారతదేశంలో ఇప్పటికీ చాలా అసమానతలు ఉన్నందుకు చాలా విచారంగా ఉంది అంటూ మరొకరు.. ఇలా కామెంట్లు పెడుతున్నారు.. మొత్తంగా.. రొటీన్‌కి భిన్నంగా జరిగిన ఈ ఒప్పంద పెళ్లి.. సోషల్ మీడియా రచ్చోరచ్చగా మారింది..

Exit mobile version