NTV Telugu Site icon

చైనా స‌న్‌: సూర్యుడి కంటే ఐదు రెట్లు వేడి…

సూర్యుడి వాతావ‌ర‌ణాన్ని, అక్క‌డి ప‌రిస్థితుల‌ను, అక్క‌డి నుంచి వెలువ‌డే శ‌క్తిని, విశ్వం యొక్క పుట్టుక‌ను తెలుసుకోవ‌డానికి ఇటీవ‌లే యూరోపియ‌న్ స్పేస్ సైన్స్‌, నాసా సంయుక్తంగా జేమ్స్ వెబ్ అనే టెలిస్కోప్‌ను స్పేస్‌లోకి పంపింది.  ఇది సూర్యుడికి అత్యంత చేరువ‌ల‌కు చేరుకొని అక్క‌డి వాతావ‌ర‌ణాన్ని, ధూళిక‌ణాల‌ను సేక‌రించి, విశ్లేషించి భూమికి పంపుతుంది.  అయితే, చైనా ఏకంగా సూర్యుడి వాతావ‌ర‌ణాన్ని భూమిపైకి తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నం చేసింది.  డ్రాగ‌న్ ఆర్టిఫిషియ‌ల్ సూర్యుడిని ల్యాబోరేట‌రీలో ఏర్పాటు చేసింది.  తొకామక్ ఫ్యుజ‌న్ రియాక్ట‌ర్‌లో ఈ ఆర్టిఫిషియ‌ల్ స‌న్ ఏర్పాటు చేసి దాని నుంచి 70 మిలియ‌న్ డిగ్రీల సెల్సియ‌న్ ఉష్ణోగ్ర‌త‌ను వ‌చ్చేలా చేసింది.  

Read: ఎయిర్ ఇండియాలో క‌రోనా క‌ల‌క‌లం: ఒకే విమానంలో 125 మందికి పాజిటివ్‌…

దాదాపు 17 నిమిషాల‌పాటు ఈ ప్ర‌యోగం జ‌రిగింది.  దీని నుంచి విడుద‌లైన శ‌క్తిని చైనా వివిధ ర‌కాల అవ‌స‌రాల కోసం వినియోగించ‌నుంది.  సూర్యుడిపై 15 మిలియ‌న్ డిగ్రీల ఉష్ణోగ్ర‌త ఉంటుంది.  దీనికి 5 రెట్లు అధిక‌మైన వేడిని చైనా సృష్టించి రికార్డ్ నెల‌కొల్పంది.  గ‌తంలో ఈ ఆర్టిఫిషియ‌ల్ సూర్యుడి నుంచి 20 మిలియ‌న్ల ఉష్ణోగ్ర‌త‌ను 101 సెక‌న్ల‌పాటు విడుద‌ల‌య్యేలా చేసి రికార్డ్ నెల‌కొల్పింది.  కాగా ఆ రికార్డును ఇప్పుడు డ్రాగ‌న్ అధిక‌మించింది.  ఏకంగా 17 నిమిషాల‌పాటు 70 మిలియ‌న్ డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌ను సృష్టించింది.