NTV Telugu Site icon

British influencer: బ్రిటిష్ ఇన్‌ఫ్లుయెన్సర్ దరిద్రపు చేష్టలు.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

Britishinfluencer

Britishinfluencer

రీల్స్ కోసమో.. ఫేమస్ కోసమో తెలియదు గానీ ఈ మధ్య యువత చేసే నీచపు పనులు కంపరం పుట్టిస్తున్నాయి. ఛీ.. అంటూ ఉమ్ము వేయించుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మెర్కాడోనా సూపర్ మార్కెట్‌లో జరిగింది.

ఇది కూడా చదవండి: Kolkata doctor case: నిందితుడు సంజయ్ రాయ్‌ను ఉరితీయండి.. సోదరి డిమాండ్

బ్రిటిష్ ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన దరిద్రపు పనులను చూసి అసహ్యించుకుంటున్నారు. ఓ సూపర్‌మార్కెట్‌లో ట్రాలీతో తిరుగుతుండగా లోదుస్తులు తీసి బ్రెడ్‌ల మధ్య పెట్టింది. అనంతరం అక్కడ నుంచి జారుకుంది. ఛాలెంజ్‌లో భాగంగా ఇలా చేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. వైరల్‌గా మారింది. లోదుస్తులు తీసేటప్పుడు పక్కనే మనుషులు తిరుగుతున్నా.. ఏ మాత్రం సిగ్గుపడకుండా నవ్వుతూనే ఈ నీచానికి ఒడిగట్టింది. వీడియోలో చాలా ఉల్లాసంగా కనిపించింది. ఈ సంఘటన మెర్కాడోనా సూపర్ మార్కెట్‌లో జరిగింది.

ఇది కూడా చదవండి: Off The Record : వైసీపీ అధికారం కోల్పోగానే ఆయన ఎందుకు సైలెంట్ అయ్యారు?

ఇక వీడియోపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ‘‘నేను ఆమెను జీవితాంతం ఏదైనా సూపర్ మార్కెట్, డిపార్ట్‌మెంట్ స్టోర్ లేదా షాపింగ్ సెంటర్‌లోకి ప్రవేశించకుండా నిషేధిస్తాను’ అని ఒకరు రాసుకొచ్చారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని ఇంకొందరు డిమాండ్ చేశారు. ఇక ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు మెర్కాడోనా సూపర్ మార్కెట్‌ ప్రతినిధులు తెలిపారు.