Site icon NTV Telugu

Birthday Cake Viral: బర్త్‌డే కేక్‌పై టెక్ట్స్ చూసి షాక్.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పోస్ట్

Cake

Cake

Birthday Cake Viral: సాధారణంగా పుట్టినరోజు నాడు వచ్చిన సర్ప్రైజ్‌ ఒకటి సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. కేక్‌పై డెలివరీ బాయ్ ఇచ్చిన సూచనతో ఆ బర్త్‌డే వేడుకకు వచ్చి వాళ్లను షాక్ కు గురి చేసింది. నెట్టింట వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. ఓ యువతి తన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయబోతూ, దానిపై ఉన్న మెసేజ్ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. నార్మల్ గా కేక్ పై “హ్యాపీ బర్త్‌డే” వంటి శుభాకాంక్షలు ఉండాల్సిన చోట.. “Leave At Security” అనే కామెంట్స్ కనిపించడంతో అక్కడున్న వారందరూ క్షణం పాటు నిశ్శబ్దంగా ఉండిపోయారు.

Read Also: Tragedy: కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఢీ కొట్టిన లారీ.. ముగ్గురు మృతి.. 15 మందికిగాయాలు

ఇక, ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన యువతిని నక్షత్ర (Nakshatra).. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న సమయంలో కేక్‌ను తీసుకొచ్చారు. కేక్‌పై ఉన్న మెసేజ్ చదివిన ఆమె షాక్ అయింది. ఆ వెంటనే మొహంలో నవ్వులు చిందించింది. చుట్టూ ఉన్నవారు కూడా ఆ పొరపాటును గమనించి నవ్వు ఆపుకోలేకపోయారు. నిజానికి ఆ కేక్‌పై ఉండాల్సింది వ్యక్తిగత బర్త్‌డే మెసేజ్.. కానీ, అపార్ట్‌మెంట్‌లు, గేటెడ్ కమ్యూనిటీల్లోకి స్విగ్గీ, జోమాటో వంటి డెలివరీ బాయ్స్ కి పర్మిషన్ లేదు.

Read Also: Dhurandhar : ‘ధురంధర్’ లో తమన్నాను డైరెక్టర్ ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా..

అయితే, ఈ పొరపాటు ఎలా జరిగిందో నక్షత్ర తన పోస్ట్ క్యాప్షన్‌లో వివరించింది.. “ఇది నా పుట్టినరోజు.. నా స్నేహితురాలు జొమాటో ద్వారా కేక్ ఆర్డర్ చేశారు.. కేక్ డెలివరీ చేసే వ్యక్తి ‘leave at security’ అని కేక్‌పై రాశాడు” అని పేర్కొంది. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. లక్షలాది మంది వీక్షించిన ఈ క్లిప్‌ ఇప్పటికే మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించింది. కామెంట్ల సెక్షన్‌ ఫన్నీ మెసేజ్ లతో నిండిపోయింది. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో సరదా చర్చలకు దారి తీస్తూ.. చిన్న పొరపాట్లు పెద్ద వినోదంగా మారుతుందో మరోసారి నిరూపిస్తోంది.

Exit mobile version