Site icon NTV Telugu

Viral Video: వీడికింకా భూమిపై నూక‌లున్నాయి… ఒక్క‌క్ష‌ణం ఆల‌స్య‌మైనా…

రోడ్ సేప్టీ విధానాలు పాటించ‌కుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంది. వాహ‌నాల‌ను అతివేగంగా న‌డ‌ప‌డం, అజాగ్ర‌త్త‌గా న‌డ‌ప‌డం, రైల్వే క్రాసింగ్ వ‌ద్ద సిగ్న‌ల్స్ ఉన్నా ప‌ట్టించుకోకుండా వాహ‌నాల‌ను న‌డిపితే ఎంత ప్ర‌మాద‌మో ఈ చిన్న వీడియో చూస్తే అర్థం అవుతుంది. ముంబైలో ఓ రైల్వే క్రాసింగ్ వ‌ద్ద రైలు వ‌స్తున్న‌ట్టు సిగ్న‌ల్ ప‌డటంతో గేట్‌మెన్ గేటును క్లోజ్ చేశాడు. కానీ, ఓ వాహ‌న‌దారుడు దానిని ప‌ట్టించుకోకుండా రైలు వ‌చ్చేలోగా క్రాస్ చేసి వెళ్లొచ్చ‌ని అనుకున్నాడు. రూల్స్‌ని బ్రేక్ చేసి బైక్‌ని ముందుకు తీసుకెళ్లాడు.

Read: Chiru – Chakri: తమన్ ఆవిష్కరించిన మహిత్ స్టూడియో లోగో!

అయితే, రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్ వేగంగా దూసుకురావ‌డం గ‌మ‌నించిన ఆ వ్యాక్తి బైక్‌ను అక్క‌డే వ‌దిలేసి వెన‌క్కి వ‌చ్చాడు. రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్ బైక్‌ను బ‌లంగా ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో బైక్ తునాతున‌క‌లైంది. బైక‌ర్ సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ‌టంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు. ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా రూల్స్ పాటించాల‌ని, పాటించ‌కుంటే ఏం జ‌రుగుతుందో ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంద‌ని నెటిజ‌న్లు కామెట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది.

Exit mobile version